పొద్దున లేస్తే పంచాయితీలు, సెటిల్మెంట్లే..!మానకొండూర్‌ ‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే పీఏది ఇదే దందా

పొద్దున లేస్తే పంచాయితీలు, సెటిల్మెంట్లే..!మానకొండూర్‌ ‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే పీఏది ఇదే దందా
  •     యువజన సంఘాల నేత శ్రీనాథ్ రెడ్డి

తిమ్మాపూర్, వెలుగు: మానకొండూర్‌‌‌‌‌‌‌‌లో షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్న మురళీధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పంచాయితీలు, సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్లే పనిగా పెట్టుకున్నారని గన్నేరువరం యువజన సంఘాల నాయకుడు అల్లూరి శ్రీనాథ్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆరోపించారు. 

సోమవారం తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. మురళీధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఎమ్మెల్యే పేరు చెప్పి నియోజకవర్గంలో అక్రమ వసూళ్లు, భూవివాదాల సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో రూ.1.26 కోట్లతో ఇల్లు కొనుగోలు చేసిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఇథనాల్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు, ఇసుక క్వారీ, రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ వ్యవహారాల్లో భారీగా డబ్బులు వసూలు చేశారని విమర్శించారు. 

మురళీధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి వ్యవహారాలతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని శ్రీనాథ్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. కార్యకర్త రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికించి ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన పేరుతో జరుగుతున్న సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్లపై స్పందించాలని కోరారు. 

మీడియా ప్రతినిధులపై సత్యాన్వేషణ పేరుతో వార్తలు రాయడాన్ని తప్పుబట్టారు. రాజేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి కేసులో పోలీసుల వ్యవహారశైలిపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే, మురళీధర్‌‌‌‌‌‌‌‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.