ఖమ్మం జిల్లాలో హైటెన్షన్.. మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లి SDRF సిబ్బంది గల్లంతు

ఖమ్మం జిల్లాలో హైటెన్షన్.. మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లి SDRF సిబ్బంది గల్లంతు

ఖమ్మం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మత్స్యకారులను కాపాడేందుకు రెండు పడవల్లో వెళ్లిన ఎస్డీఆరెఫ్​ సిబ్బంది గల్లంతు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 2026 నవంబర్ 4న సాయంత్రం సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వరద నీటిలో రెండు పడవలు గల్లంతయ్యాయి.

పడవల్లో వెళ్లిన పదిమంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతయ్యారు. - బలమైన గాలి, నీటి ప్రవాహానికి రెండు SDRF బోట్లు ఒక్కసారిగా తిరగబడ్డాయి. వరద నీటిలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన క్రమంలో ప్రమాదం జరిగింది.  బేతుపల్లి చెరువులో చిక్కుకున్న 8 మంది మత్సకారులను రక్షించే క్రమంలో ముగ్గురిని ఒడ్డుకు చేర్చారు.  మిగతా ఐదుగురి కోసం  వెళ్లిన సందర్భంలో పడవలు నీటమునిగాయి. 

ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది గళ్లంతుకావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. వరద నీరు భారీగా వస్తుండంతో ఏం జరుగుతుందోనని హై టెన్షన్ మొదలైంది. ఎస్డీఆరెఫ్​ సిబ్బందిని రక్షించేందుకు NDRF బలగాలు రంగంలోకి దిగాయి.   గల్లంతైన 10 మంది కానిస్టేబుళ్ల కోసం గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.

ఒక వైపు చీకటి కావడం, మరోవైపు వరద నీరు ఉధృతి కొనసాగుతుండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందిగా మారింది. మత్స్యకారుల కోసం వెళ్లిన సిబ్బంది క్షేమంగా ఉన్నారా లేదా అనే ఆందోళనలో అధికారులు ఉన్నారు. మత్స్యకారుల పరిస్థితి ఏంటనేది కూడా ఆందోళనగా మారింది.