నీట మునిగిన అమ‌రావ‌తి.. సెక్రటేరియట్లో మోటార్లతో వాననీరు ఎత్తిపోసిన సిబ్బంది

నీట మునిగిన అమ‌రావ‌తి.. సెక్రటేరియట్లో మోటార్లతో వాననీరు ఎత్తిపోసిన సిబ్బంది

మురసు తుపాను కారణంగా కురిసిన వర్షానికి అమరావతి జలమయం అయ్యింది.  భారీ వర్షంతో పలు ప్రాంతాలు, కాలనీలు చెరువులను తలపించాయి. ముఖ్యంగా సెక్రటేరియట్ లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. ఫస్ట్ బ్లాక్ లో నీరు నిలవడంతో భారీ కెపాసిటీ మోటార్లతో వ‌ర‌ద నీటితో ఎత్తిపోశారు అధికారులు.

అదేవిధంగా క్లాస్ 4 ఎంప్లాయీస్ అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ వరకు వర్షం నీరు చేరుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. MLA, MLC క్వాటర్స్ పక్కనే భారీగా నీరు చేరడంతో చెరువును తలపించాయి. 

VIT యూనివ‌ర్సిటీ పక్కన భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దీంతో మోటార్లతో వర్షం నీరు ఎత్తిపోస్తున్నారు సిబ్బంది. అదే విధంగా రైతులకు ఇచ్చిన ఇంటి స్థలాల రోడ్లు సైతం నీట మున‌గటంతో ఆందోళన చెందుతున్నారు.