మహబూబ్ నగర్ జిల్లాలో ఏసీబీ రైడ్స్.. రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన DYSO

మహబూబ్ నగర్ జిల్లాలో ఏసీబీ రైడ్స్.. రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన DYSO

మహబూబ్ నగర్ జిల్లాలో ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. 2026 నవంబర్ 5 (గురువారం) నిర్వహించిన దాడుల్లో జిల్లా యువజన క్రీడల అధికారి (డీవైఎస్ఓ) లంచం తీసుకుంటూ దొరికారు. 

డిస్ట్రిక్ట్ యూత్ అండ్  స్పోర్ట్స్ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డితో  లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కారు. అదే విధంగా కంప్యూటర్ ఆపరేటర్ ఉమేష్ ను కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

క్యాటరింగ్ బిల్స్ ప్రాసెస్ చేయడానికి DYSO రాజశేఖర్ రెడ్డి లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. బాధితుడు ఫిర్యాదు మేరకు నిఘా ఉంచి అధికారితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ను పట్టుకున్నారు  ఏసీబీ అధికారులు.