ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మంత్రి కోమటిరెడ్డి గుడ్ న్యూస్

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మంత్రి కోమటిరెడ్డి గుడ్ న్యూస్

హైదరాబాద్: ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా స్టడీ మెటీరియల్‎ను ఉచితంగా అందిస్తానని ప్రకటించారు. గురువారం (నవంబర్ 5) నల్గొండ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ పొందే అభ్యర్థులకు ప్రభుత్వం తరఫున, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. చదువుకునే విద్యార్థులకు తాను ఎల్లప్పుడు అండగా ఉంటానని పేర్కొన్నారు.

ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని కృషి చేస్తే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందన్నారు. తాను కూడా ప్రజాప్రతినిధిగా, ప్రత్యేకించి ఎమ్మెల్యే, మంత్రిగా కావాలన్న పట్టుదలతోనే విద్యార్థి దశ నుండి కృషి చేశానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్లగొండ కలెక్టర్ చంద్ర శేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.