‘ఎల్నినో’తో ఇబ్బందుల్లేకుండా చూడాలి.. నకిరేకల్ లో అవగాహన సదస్సు

‘ఎల్నినో’తో ఇబ్బందుల్లేకుండా చూడాలి.. నకిరేకల్ లో  అవగాహన సదస్సు
  • శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 

 నకిరేకల్, వెలుగు: ఎల్ నినో తో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్  రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని  శ్రీనివాస గార్డెన్​లో ఎల్ నినో పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 

తాగునీరు, వ్యవసాయం, విద్యుత్, పశుసంపద, భూగర్భ జలాలు, ఆహారం, కూలీలకు  ఉపాధి వంటి విషయంలో ఎలాంటి ఇబ్బందులకు రాకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ నినోపై ముఖ్యమంత్రి ప్రజా ప్రతినిధులందరితో సమీక్షించారని, ఈ సమస్యను ప్రజలు సీరియస్ గా తీసుకోవాలని కోరారు. 

ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ ఎల్ నినో  ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు  రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. కలెక్టర్ బి .చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎల్ నినో కారణంగా ఏర్పడ్డ పరిస్థితులను ప్రజలకు తెలియజేస్తూనే నీటిని పొదుపుగా వినియోగించుకునేలా చూడాలని సూచించారు. 

అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.  కార్యక్రమంలో  స్థానిక సంస్థల ఇన్​చార్జ్  అడిషనల్​కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.