నల్లగొండ: పోలీస్ స్టేషన్‌లో వివిధ కేసులకు సంబంధించి సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను అక్రమంగా విక్రయించిన ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగుచూసింది. నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో గతంలో కానిస్టేబుల్‌గా పనిచేసిన సైదులు యాదవ్ ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసు శాఖ చర్యలు చేపట్టింది.
స్టేషన్‌లో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాల తాళాలు తన వద్ద ఉండటాన్ని ఆసరాగా చేసుకుని సైదులు యాదవ్ ఈ వ్యవహారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన వ్యక్తి పల్సర్ బైక్‌ను నకిరేకల్‌కు చెందిన ఓ వ్యక్తికి కేవలం రూ.10 వేలకే విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కొంతకాలం తర్వాత హైదరాబాద్‌కు చెందిన అసలు వాహన యజమాని తన బైక్ కోసం నకిరేకల్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆరా తీయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధితుల నుంచి ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
ప్రస్తుతం కేతపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సైదులు యాదవ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
