యాదాద్రి భువనగిరి జిల్లా : జోగిని సుధాకర్‌‌‌‌‌‌‌‌ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

యాదాద్రి భువనగిరి జిల్లా : జోగిని సుధాకర్‌‌‌‌‌‌‌‌ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌‌‌‌‌‌‌‌
  • భారీగా బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్న నిర్మల్ జిల్లా పోలీసులు

నిర్మల్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌లో జోగిని సుధాకర్‌‌‌‌‌‌‌‌స్వామిని హత్య చేసి, అతడి వద్ద ఉన్న సొత్తుతో పరారైన ఇద్దరు నిందితులను నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 1.4 కిలోల బంగారం, 3.5 కిలోల వెండి, రూ.9 లక్షల నగదు, హరియర్‌‌‌‌‌‌‌‌ కారును స్వాధీనం చేసుకున్నారు. 

వివరాల్లోకి వెళ్తే.. సంస్థాన్‌‌‌‌‌‌‌‌ నారాయణపూర్‌‌‌‌‌‌‌‌ మండలం పుట్టపాకకు చెందిన రాళ్లబండ సుధాకర్‌‌‌‌‌‌‌‌ జోగినిగా మారి, పండుగల సమయంలో పూజారిగా పనిచేస్తూ చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌లో నివసిస్తున్నారు. తరచూ అసోంలోని కామాఖ్య శక్తిపీఠానికి వెళ్లే అతడి వద్ద ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌కు చెందిన హర్షిత్‌‌‌‌‌‌‌‌, పవన్‌‌‌‌‌‌‌‌ శిష్యులుగా చేరారు. 

కొంతకాలంగా అతడితోనే ఉంటున్న వీరిద్దరూ శనివారం అర్ధరాత్రి సుధాకర్‌‌‌‌‌‌‌‌ ను హత్య చేసి, నగదు, నగలు, కారుతో పరారయ్యారు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యాదాద్రి పోలీసుల సమాచారంతో నిర్మల్‌‌‌‌‌‌‌‌ జిల్లా పోలీసులు సరిహద్దుల్లో నిఘా పెంచారు. 

ఆదివారం అర్ధరాత్రి సోన్‌‌‌‌‌‌‌‌ టోల్‌‌‌‌‌‌‌‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేస్తున్న నిర్మల్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌ ఎస్సై లింబాద్రి, సిబ్బంది నిందితుల కారును గుర్తించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు.

 నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సొత్తును యాదాద్రి జిల్లా పోలీసులకు అప్పగించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై లింబాద్రి, సిబ్బందిని నిర్మల్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ డాక్టర్‌‌‌‌‌‌‌‌ జానకి షర్మిల అభినందించారు.