Mokshagna Debut: మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై రోజుకో ట్విస్ట్.. విలన్‌గా స్టార్ హీరో కొడుకు, హీరోయిన్‌గా స్టార్ నటి కూతురు?

Mokshagna Debut: మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై రోజుకో ట్విస్ట్.. విలన్‌గా స్టార్ హీరో కొడుకు, హీరోయిన్‌గా స్టార్ నటి కూతురు?

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై టాలీవుడ్‌లో రోజుకో కొత్త అప్‌డేట్ హాట్ టాపిక్‌గా మారుతోంది. బాలయ్య తనయుడి ఫస్ట్ మూవీ చుట్టూ ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ కాగా.. తాజాగా వినిపిస్తున్న వార్తలు మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ సినిమాలో మోక్షజ్ఞకు జోడీగా ఓ స్టార్ హీరోయిన్ కుమార్తెను, పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో తనయుడిని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అంటే హీరో, హీరోయిన్, విలన్.. ముగ్గురూ స్టార్ ఫ్యామిలీలకు చెందిన వారేనా? అన్న చర్చ మొదలైంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతుందా? మోక్షజ్ఞ డెబ్యూతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పునర్జన్మల నేపథ్యంలో భారీ మూవీ!

‘బింబిసార’తో సోషియో ఫాంటసీ జానర్‌లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన, ఆ ప్రాజెక్ట్ తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. టైమ్ ట్రావెల్, పునర్జన్మల నేపథ్యంలో సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు టాక్. విజువల్ ఎఫెక్ట్స్‌కు భారీ ప్రాధాన్యత ఉండటంతో మేకర్స్ ఈ ప్రాజెక్టును పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారు. గ్రాండ్ విజువల్స్, సరికొత్త కాన్సెప్ట్, పవర్‌ఫుల్ కథాంశంతో మోక్షజ్ఞను ప్రేక్షకులకు పరిచయం చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

శ్రీలీలకు బదులుగా రాషా ఎంట్రీ?

మొదట్లో మోక్షజ్ఞకు జోడీగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. తన ఎనర్జిటిక్ డ్యాన్స్, యాక్టింగ్ టాలెంట్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీలీల ఈ సినిమాకు పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుందని అభిమానులు భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం మేకర్స్ రాషా తడానీ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న రాషా, ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో తెలుగు తెరపై కూడా అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞతో ఆమె జోడీ కుదిరితే స్క్రీన్‌పై కొత్త కాంబినేషన్ చూడొచ్చని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బాలయ్య – రవీనా కాంబో

ఈ ప్రాజెక్టులో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. గతంలో బాలకృష్ణ, రవీనా టాండన్ కలిసి ‘బంగారు బుల్లోడు’ సినిమాలో నటించారు. ఇప్పుడు అదే కుటుంబాలకు చెందిన వారసులు మోక్షజ్ఞ, రాషా ఒకే సినిమాలో జతకట్టనున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ అధికారికంగా ఖరారైతే అభిమానులకు ఇది నిజంగానే స్పెషల్ అట్రాక్షన్‌గా మారనుంది.

విలన్‌గా విక్రమ్ తనయుడు?

మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం చిత్రబృందం పలువురు నటుల పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది. అయితే చివరకు తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్‌ను ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. ధ్రువ్ ఇప్పటికే తమిళంలో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే మోక్షజ్ఞ వర్సెస్ ధ్రువ్ విక్రమ్ పోరు వెండితెరపై మరో లెవల్‌లో ఉండనుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వచ్చే ఏడాది సెట్స్‌పైకి?

మోక్షజ్ఞ తన డెబ్యూ మూవీ కోసం ఫిజికల్ మేకోవర్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నందమూరి అభిమానుల్లో జోష్ పెంచుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని, వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అయితే హీరోయిన్‌గా రాషా తడానీ ఎంపిక, ఇతర నటీనటుల వివరాలు, షూటింగ్ షెడ్యూల్‌పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీతో టాలీవుడ్‌లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో చూడాలి!

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. డైరెక్టర్ల లిస్ట్‌లో రోజుకో ట్విస్ట్!

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ విషయంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తొలుత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా ప్రకటించగా, కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. తాజాగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ పేరు తెరపైకి రావడంతో మరోసారి ఈ మూవీ హాట్ టాపిక్‌గా మారింది. ఆల్మోస్ట్ వశిష్ఠ డైరెక్ట్ చేయడం కన్ఫామ్ అనే సంకేతాలు ఉన్నాయి. మైత్రి మేకర్స్ అనౌన్స్ కూడా చేయడంతో పట్టాలెక్కే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.