గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. రికార్డు సెక్షన్‌లో చెలరేగిన మంటలు

గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. రికార్డు సెక్షన్‌లో చెలరేగిన మంటలు

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని రికార్డు సెక్షన్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ఆస్పత్రి ప్రాంగణంలో కలకలం రేగింది.

రికార్డు సెక్షన్‌లో మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్న విలువైన ఫైల్లు, పత్రాలు దగ్ధమైనట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎంతమేర ఆస్తి, రికార్డులకు నష్టం వాటిల్లిందనే వివరాలు కూడా వెల్లడికావాల్సి ఉంది. ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.