జలసిరి పనులు వేగవంతం చేయాలి..గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులకు డిమాండ్

జలసిరి పనులు వేగవంతం చేయాలి..గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులకు డిమాండ్
  • పీఆర్, ఆర్‌‌‌‌‌‌‌‌డీ కమిషనర్‌‌‌‌‌‌‌‌ దివ్య దేవరాజన్‌‌‌‌‌‌‌‌ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా జలసిరి కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి ఈ నెల 19 నాటికి ఎస్టిమేషన్లు పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి అన్ని జిల్లాల పీఆర్, ఆర్‌‌‌‌‌‌‌‌డీ ఉన్నతాధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 గ్రామీణ ప్రాంతాల్లో అమలవుతున్న అభివృద్ధి పనులు, పౌరసేవలు, వీబీ జీ రామ్ జీ స్కీమ్​అమలు తీరుపై సమీక్షించి ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో అర్హులైన ప్రతిఒక్కరికీ ఉపాధి హామీ జాబ్ కార్డులు మంజూరు చేయాలన్నారు. 

జలసిరిలో భాగంగా రైతుల పొలాల్లో పంట కుంటలు (ఫార్మ్ పాండ్స్), వ్యక్తిగత ఇంకుడుగుంతలు, కమ్యూనిటీ సోక్ పిట్స్, బోరుబావుల రీఛార్జ్ స్ట్రక్చర్లు తదితర జలసంరక్షణ పనులను యుద్ధప్రాతిపదికన గ్రౌండింగ్ చేయాలని సూచించారు. 

జీపీల్లో కార్యదర్శుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని, డీపీవోలు, డీఎల్‌‌‌‌‌‌‌‌పీవోలు, ఎంపీవోలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. జీపీ సాప్ పోర్టల్‌‌‌‌‌‌‌‌లో పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న వివరాలను సత్వరమే పూర్తి చేయాలన్నారు.