దీపావళి తొలి రోజు పండుగ : 6న ధన త్రయోదశి పూజ ఎలా చేయాలి.. సరైన ముహూర్తం ఏంటీ..

దీపావళి తొలి రోజు పండుగ : 6న ధన త్రయోదశి పూజ ఎలా చేయాలి.. సరైన ముహూర్తం ఏంటీ..

హిందువులు జరుపుకొనే పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. ధనత్రయోదశి రోజును చాలా భక్తి శ్రద్దలతో పూజిస్తారు.  దీనినే దంతేరాస్​ అనికూడా అంటారు.  అలాంటి పవిత్రమైన రోజు ఈ ఏడాది (2026) నవంబర్​ 6 వ తేదీ వచ్చింది.  ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని.. ధన్వంతరి భగవానుడిని..సంపదలకు అధిపతి అయిన కుబేరుడిని పూజిస్తారు. మరి ఈ ఏడాది దంతేరాస్​ రోజుకు లక్ష్మీదేవికి శుభముహూర్తం ఎప్పుడు ... ఎలా పూజ చేయాలి.. ఎందుకు పూజించాలో మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

 హిందువులు ధనత్రయోదశి పండుగను అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు.  దేవతలు.. రాక్షసులు అమృతం కోసం క్షీర సాగరాన్ని మథించే సమయంలో లక్ష్మీదేవి  ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం త్రయోదశి రోజున జన్మించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  ఆ సమయంలో విష్ణుమూర్తి ఆమెను భార్యగా స్వీకరించి .. సిరి సంపదలకు, ఐశ్వర్యానికి అధి దేవతగా ప్రకటించారు. 

ధన త్రయోదశి పూజా ముహూర్తం

2026 నవంబర్ 6న శుక్రవారం ధన త్రయోదశి జరుపుకోనున్నారు. నవంబర్ 6 ఉదయం 10:30 గంటలకు త్రయోదశి తిథి ప్రారంభమై, నవంబర్ 7 ఉదయం 10:47 గంటలకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు.

లక్ష్మీ పూజకు సాయంత్రం 6:02 నుంచి 7:57 గంటల వరకు శుభ ముహూర్తం

సంస్కృతంలో 'ధన్' అంటే సంపద, 'తేరస్' అంటే పదమూడవ తిథి. దీనిని ధనత్రయోదశి, ధన్వంతరి త్రయోదశి అని పిలుస్తారు. ఆ రోజు( నవంబర్​ 6)  సాయంత్రం ప్రదోష కాలంలో చేసే పూజ విశేష ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతున్నారు.

 పూజా విధానం, యమ దీపం...

ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసి గుమ్మానికి రంగురంగుల రంగవల్లులు, పూల తోరణాలు అలంకరించాలి. పూజా పీఠంపై లక్ష్మీదేవి, గణపతి, కుబేరుడి ప్రతిమలను ఉంచి పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షతలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించాలి. 

కొత్తగా కొన్న బంగారం, వెండి లేదా ఇతర పాత్రలను పూజలో ఉంచి దీపారాధన చేసి లక్ష్మీ మంత్రాలు పఠించాలి. 
ధన్‌తేరస్ సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణాభిముఖంగా యమ దీపం వెలిగించడం వల్ల కుటుంబ సభ్యులకు అపమృత్యు భయాలు తొలగి ఆయుష్షు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. 

పూజలోఉంచాల్సినవి..

ఎర్రగులాబీ, తామరపువ్వు, అక్షత, ఎర్రటి వెన్నెముక, ధూపం, దీపం, నైవేద్యం, కమలగట్ట, బటాషే, మిఠాయిలు, ఖీర్ మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవిని పూజించండి. 
అక్షతలు, పుష్పాలు, నైవేద్యాలు, ధూపం, దీపం, చందనం మొదలైన వాటిని కుబేరునికి సమర్పించి పూజించండి. 
పూజ సమయంలో మంత్రాన్ని జపించండి. ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారాన్ని అందించండి. పూజ సమయంలో కొత్త ఖాతా పుస్తకం, పెన్​ మొదలైనవాటిని కూడా పూజించండి

బంగారం లేదా వెండి వంటి ఖరీదైన వస్తువులను స్తోమత ఉంటేనే కొనాలి లేదంటే ఒక చిన్న గిన్నె లేదా పూజా సామగ్రిని భక్తిశ్రద్ధలతో కొనుగోలు చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధనత్రయోదశి పండుగ పరమార్థం ఆడంబరాల్లో కాకుండా కృతజ్ఞతా భావం, ఆర్థిక క్రమశిక్షణ, సకల ఆరోగ్య సంపదల కోసం చేసే నిష్కల్మషమైన ఆరాధనలోనే దాగి ఉందని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.