AP Election 2026: గన్నవరంలో పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతా లోపాలు.. ఆందోళనలో ఓటర్లు..

AP Election 2026: గన్నవరంలో పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతా లోపాలు.. ఆందోళనలో ఓటర్లు..

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గురువారం ( నవంబర్ 5 ) ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే.. కృష్ణా జిల్లా గన్నవరంలోని పలు పోలింగ్ కేంద్రాల దగ్గర భద్రతా లోపం బయటపడింది. పోలీస్ కానిస్టేబుళ్లు లేకుండా NCC విద్యార్థులతో భద్రత ఏర్పాట్లు చేయడం ఆందోళన కలిగిస్తోంది.

గన్నవరంలో దావాజీగూడెం, బుద్ధవరం ,పోలింగ్ కేంద్రాల దగ్గర ఒక లేడీ కానిస్టేబుల్, ఎన్సీసీ విద్యార్థులు తప్ప పోలీసులు లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓటర్లు. అంతే కాకుండా దావాజిగూడెం ఓటర్లకు బుద్ధవరంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారని... బుద్ధవరం గ్రామానికి చెందిన ఓటర్లకు దావాజిగూడెంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారని.. దీంతో ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు ఓటర్లు.

తమ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాలు ఉండటంతో ఇబ్బంది పడుతున్నామని.. ఓటు లేని విద్యార్థులతో పోలింగ్ కేంద్రాలకు దగ్గర భద్రత ఏర్పాటు చేశారని అంటున్నారు ఓటర్లు.