ఇండియన్ స్టాక్ మార్కెట్ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. 2026, నవంబర్ 5వ తేదీ ఉదయం నుంచి.. మార్కెట్ లోని అన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్ట్ ఏకంగా 14 వందల పాయింట్లు.. నిఫ్టీ 400 పాయింట్ల లాభంతో నడుస్తుంది.
స్టాక్ మార్కెట్ లోని అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండిగో షేర్ 5 శాతం, బజాబ్ ఫైనాన్స్ 4 శాతం, ఏషియన్ పెయింట్స్ 4 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 3.5 శాతం, మారుతి 3.5 శాతం లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్లను పరిశీలిస్తే ఎల్ అండ్ టీ 2.5 శాతం, HDFC బ్యాంక్ 2.6 శాతం, ICICI బ్యాంక్ 2.3 శాతం, ఇన్ఫోసిస్ 2 శాతం, SBI 2 శాతం లాభాల్లో ఉండగా.. కొటక్ బ్యాంక్ మాత్రం నష్టాల్లో నడుస్తుంది. ఇదే సమయంలో ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లోని కంపెనీల షేర్లు మాత్రం అనూహ్యంగా నష్టాల్లోకి వెళ్లాయి. స్టాక్ మార్కెట్ ఇంత లాభాల్లో ఉన్నా.. రిలయన్స్, ఎయిర్ టెల్, ITC, NTPC, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ట్రంప్ కు ఎదురుదెబ్బ.. మన స్టాక్ మార్కెట్ కు లాభాలు :
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లిక్ పార్టీ ఓడిపోవటం.. అధ్యక్షుడు ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో ఇండియన్ స్టాక్ మార్కెట్ తోపాటు ఇతర దేశాల మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక నుంచి ఆయా దేశాలపై విధించే సుంకాల విషయంలో వెనక్కి తగ్గొచ్చని.. ఆర్థిక ఆంక్షలు, నిబంధనల విషయంలో సడలింపులు ఉంటాయనే ఆశతో ఉన్నారు పెట్టుబడిదారులు. ఇరాన్ పై యుద్ధం కొలిక్కి వస్తే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడతాయనే ఉద్దేశంతో ఉన్నారు పెట్టుబడిదారులు. ఈ పరిణామాలు మన స్టాక్ మార్కెట్ కు లాభాలను తెచ్చిపెట్టారు. ట్రంప్ హయాంలో దూకుడుగా ఉన్న ఫార్మా కంపెనీల షేర్లు.. ఇప్పుడు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
►ALSO READ | గోల్డ్ ఈటీఎఫ్స్కు మస్తు డిమాండ్.. పసిడి ధరల పతనంతో పరుగు
ఇండియా ఆయిల్ నౌకలకు ఇరాన్ మినహాయింపు :
అమెరికాలో ట్రంప్ పార్టీ ఓడిపోవటంతో.. ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ట్రంప్ కు ఎదురుదెబ్బ తగిలింది అని తెలియటంతో.. భారత్ తో సహా.. చైనా, ఖతార్, ఇరాక్ దేశాలకు చెందిన ఆయిల్, వాణిజ్య నౌకలకు హర్మూజ్ జలసంధి నుంచి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది ఇరాన్. భారత్ నుంచి మందుల కొనుగోలును సులభతరం చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని.. దీనికి అమెరికా కూడా అడ్డుచెప్పటం లేదంటూ ఇరాన్ విదేశాంగ విధాన కమిటీ డిప్యూటీ చైర్మన్ అమీర్ హయత్ ప్రకటించిన క్రమంలో.. భారత స్టాక్ మార్కెట్ పాజిటివ్ గా స్పందిస్తుంది.
