సైబర్ దాడుల నుంచి కాపాడే డిజిటల్ ఎమర్జెన్సీ కిట్.. 

సైబర్ దాడుల నుంచి కాపాడే డిజిటల్ ఎమర్జెన్సీ కిట్.. 

హైదరాబాద్​, వెలుగు: సైబర్ దాడులు, నెట్‌‌‌‌వర్క్ ఇబ్బందుల నుంచి సంస్థలను కాపాడేందుకు ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ప్లాట్‌‌‌‌ఫామ్ (డీఈ-సీఐఎక్స్) ఇండియా దేశంలోనే తొలిసారిగా డిజిటల్ ఎమర్జెన్సీ కిట్‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌లో బుధవారం ఆవిష్కరించింది. నగరంలో వేగంగా పెరుగుతున్న ఐటీ, క్లౌడ్, ఏఐ, డేటా సెంటర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారు. 

వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ముందస్తు కనెక్టివిటీ బ్యాకప్ మార్గాలను ఏర్పాటు చేసుకోవడం దీని ప్రధాన లక్ష్యం. డీఈ-సీఐఎక్స్ ఇండియా ప్రతినిధి సుహైబ్ లాగ్డే మాట్లాడుతూ సంస్థలు తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

హైదరాబాద్‌‌‌‌లోని టెక్నాలజీ హబ్ సంస్థలన్నీ ఈ డిజిటల్ రెజిలియెన్స్ విధానం ద్వారా నెట్‌‌‌‌వర్క్ వైఫల్యాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆయన వివరించారు.