తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దు అడవుల్లో కోడి పందేలు, పేకాట యధేచ్ఛగా సాగుతున్నాయి. కోడి పందేలు ప్రతిరోజు జాతరను తలపిస్తున్నాయి. కోడిపందాల స్థావరాలపై ఛత్తీస్గడ్ పోలీసులు మెరుపు దాడి చేశారు. 156 మందిపై కేసులు, రూ.20.01 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
47 కార్లు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లా రైగూడ అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్న సిండికేట్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో తెలంగాణ, ఛత్తీస్గడ్, మహారాష్ట్రకు చెందిన జూదగాళ్లు ఉన్నారు.
