ఏపీ గ్రూప్‌‌‌‌‌‌‌‌–1 కేసులో ఈడీ సోదాలు..బంజారాహిల్స్, అల్వాల్‌‌‌‌‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లలో రెయిడ్స్

ఏపీ గ్రూప్‌‌‌‌‌‌‌‌–1 కేసులో ఈడీ సోదాలు..బంజారాహిల్స్, అల్వాల్‌‌‌‌‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లలో రెయిడ్స్

హైదరాబాద్, వెలుగు: ఏపీపీఎస్సీ గ్రూప్-–1 పేపర్ల మూల్యాంకనం కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని మాజీ ఐపీఎస్ అధికారి, ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు నివాసంతో పాటు బంజారాహిల్స్ పంచవటి కాలనీలోని క్యామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఆ సంస్థ ఎండీ పి. మధుసూదనరావు ఇండ్లలో బుధవారం సోదాలు నిర్వహించారు.

సికింద్రాబాద్ డిఫెన్స్ కాలనీలోని ట్రూ గ్రేడర్ సర్వీసెస్ కార్యాలయం, నేరేడ్‌‌‌‌‌‌‌‌మెట్‌‌‌‌‌‌‌‌లోని అక్కెల్లపెరి శ్రీనివాసరావు, అల్వాల్ వెంకటాపురంలోని మహంకాళి రఘురామ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. గతేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది. కాగా, 2018 నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ మేరకు 2020లో మెయిన్స్ పరీక్షలు జరిగాయి. వీటి జవాబుపత్రాలను అర్హత లేని 66 మందితో మూల్యాంకనం చేయించినట్టు ఆరోపణలు ఉన్నాయి.