పారిస్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో.. జొకోవిచ్‌‌‌‌ బోణీ

పారిస్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో.. జొకోవిచ్‌‌‌‌ బోణీ

పారిస్‌‌‌‌: సెర్బియా సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ నొవాక్‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌.. పారిస్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ టెన్నిస్‌‌‌‌ టోర్నీలో బోణీ చేశాడు. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌లో జొకోవిచ్‌‌‌‌ 6–7 (5), 7–5, 6–1తో వాలెంటిన్‌‌‌‌ వాచెరోట్‌‌‌‌ (మొనాకో)పై గెలిచాడు. హోరాహోరీగా సాగిన పోరులో సెర్బియా ప్లేయర్‌‌‌‌ తొలి సెట్‌‌‌‌ను కోల్పోయాడు. రెండో సెట్‌‌‌‌లోనూ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నాడు. 

స్కోరు 4–4తో సమంగా ఉన్న దశలో మూడు బ్రేక్‌‌‌‌ పాయింట్లను కాపాడుకుని మ్యాచ్‌‌‌‌లో నిలిచాడు. అయితే బలమైన సర్వీస్‌‌‌‌లు, బేస్‌‌‌‌ లైన్‌‌‌‌ గేమ్‌‌‌‌తో మూడో సెట్‌‌‌‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. ఈ టోర్నీలో సెమీస్‌‌‌‌కు చేరితేనే.. ఏటీపీ ఫైనల్స్‌‌‌‌ రేసులో జొకోవిచ్‌‌‌‌ నిలిచే అవకాశం ఉంది. ఇతర మ్యాచ్‌‌‌‌లలో మూడో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) 6-–3, 6–-4తో కామెరాన్ నోరీ (బ్రిటన్‌‌‌‌)పై, టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 3–6, 6–3, 6–4తో బెంజామిన్‌‌‌‌ బోంజి (ఫ్రాన్స్‌‌‌‌)పై  విజయం సాధించారు.