హైదరాబాద్: బీసీసీఐ సీనియర్ విమెన్స్ టీ20 టోర్నీలో హైదరాబాద్ ఆల్‌రౌండర్ వంక పూజ (41 బాల్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55 నాటౌట్, 4/15) సత్తా చాటింది. బుధవారం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ దుమ్మురేపింది. దాంతో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో పుదుచ్చేరిపై గెలిచింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన పుదుచ్చేరి 19.5 ఓవర్లలో 133 రన్స్‌కు ఆలౌటైంది. తర్వాత హైదరాబాద్ 19.2 ఓవర్లలో 134/3 స్కోరు చేసి గెలిచింది. నాలుగు ఓవర్లలో కోటాలో పూజ నాలుగు కీలక వికెట్లు తీసి పుదుచ్చేరిని అడ్డుకుంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన పూజ.. ఈ టోర్నీలో నాలుగు వికెట్ల హాల్ సాధించడం ఇది మూడోసారి.
