మాటలు లేకుండానే మ్యాజిక్ చేస్తున్న అనీష్.. ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ విడుదల చేసిన ఎన్టీఆర్

మాటలు లేకుండానే మ్యాజిక్ చేస్తున్న అనీష్.. ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ విడుదల చేసిన ఎన్టీఆర్

అనీష్, అనస్వర రాజన్ జంటగా మహేష్ ఉప్పల తెరకెక్కించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. నాగార్జున సమర్పణలో   దర్శకుడు వెంకీ కుడుముల నిర్మించారు. ఇందులో అనీష్‌‌‌‌ మూగ యువకుడిగా నటించాడు. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను హీరో ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌ చేశారు.  “ ఒక్క మాట కూడా మాట్లాడకుండా  డెబ్యూ సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడం అనీష్ రియల్ గట్స్‌‌‌‌కి నిదర్శనం’  అంటూ మూవీ టీమ్‌‌‌‌కు ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ బెస్ట్ విషెస్ చెప్పారు. ట్రైలర్‌‌లో  ఓ దొంగను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తుంటారు. 

మరోవైపు తనకు మాటలు రాకపోయినా మాటల్లో చెప్పలేనంత గొప్పగా కీర్తిని ప్రేమిస్తుంటాడు అర్జున్. అయితే అనుకోకుండా ఈ జంట డేంజర్‌‌‌‌‌‌‌‌లో పడుతుంది.  ఈ ఇద్దరి కోసం పోలీసులు, గూండాల ముఠా వెతుకుతుంటారు. ఓ మిస్టీరియస్ పెన్‌‌‌‌డ్రైవ్, వెయ్యి కోట్ల డీల్ దీనికి కారణం. ఆ డీల్‌‌‌‌కు అర్జున్‌‌‌‌కు లింక్ ఏంటి.. ఎందుకు వాళ్లలా వెంటపడుతున్నారనేది అసలు కథ. లవ్, కామెడీ, రొమాన్స్‌‌‌‌, యాక్షన్‌‌‌‌, సస్పెన్స్‌‌‌‌ లాంటి అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌తో కట్ చేసిన ట్రైలర్‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంది. నవంబర్ 13న సినిమా విడుదల  కానుంది.