‘కింగ్ 100’లో పవర్‌ఫుల్ పొలిటీషియన్‌ గా టబు.. మహంతి ఝాన్సీ రాణి పాత్రలో ఫస్ట్ గ్లింప్స్ విడుదల

‘కింగ్ 100’లో పవర్‌ఫుల్ పొలిటీషియన్‌ గా టబు.. మహంతి ఝాన్సీ రాణి పాత్రలో ఫస్ట్ గ్లింప్స్ విడుదల

నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం ‘కింగ్ 100’. ఆయన కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 100వ చిత్రం. టబు కీలకపాత్ర పోషిస్తోంది.  తమిళ దర్శకుడు రా కార్తీక్‌‌‌‌ దర్శకత్వం వహిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌‌‌‌ నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. బుధవారం టబు బర్త్ డే సందర్భంగా విషెస్‌‌‌‌ చెబుతూ మేకర్స్‌‌‌‌ తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ గ్లింప్స్‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె మహంతి ఝాన్సీ రాణి అనే పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో నటిస్తోంది.  “ఈ ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. లక్‌‌‌‌ను నమ్మేవాళ్లు ఒకరు, హార్డ్ వర్క్‌‌‌‌ను నమ్మేవాళ్లు మరొకరు. ఐ హేట్ లక్” అంటూ టబు చెప్పిన డైలాగ్‌‌‌‌ హైలైట్‌‌‌‌గా నిలిచింది. 

జనం నుంచి వచ్చిన పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ పొలిటీషియన్‌‌‌‌గా తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లోని ఇంటెన్సిటీని, పవర్‌‌‌‌‌‌‌‌ను తెలియజేసేలా గ్లింప్స్‌‌‌‌ కట్ చేసిన తీరు ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.   డిసెంబర్ 24న సినిమా విడుదల కానుంది. ‘నిన్నే పెళ్లాడ‌‌‌‌తా’ చిత్రంలోని పండుగా ట‌‌‌‌బును ఎవ‌‌‌‌రూ మ‌‌‌‌రిచిపోలేర‌‌‌‌ని, ఇప్పుడు మహంతి ఝాన్సీ రాణీగా ప్రేక్షకుల మ‌‌‌‌దిలో నిలిచిపోతుంద‌‌‌‌ంటూ నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు.  28 ఏళ్ల తర్వాత మరోసారి వీళ్లిద్దరూ కలిసి కనిపించబోతున్నారు.