సరికొత్త మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా ‘మాయలేడి’.. రాకేశ్ వర్మ

 సరికొత్త మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా ‘మాయలేడి’.. రాకేశ్ వర్మ

‘ఎవరికీ చెప్పొద్దు’ ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘మాయలేడి’. ప్రశంకర్ దర్శకుడు. మధుమిత సర్కార్ హీరోయిన్. ఈనెల 13న సినిమా విడుదల కానుంది.  బుధవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.  రాకేష్ వర్రె మాట్లాడుతూ ‘పేకమేడలు, ఎవరికీ చెప్పొద్దు సినిమాల తరహాలో వైవిధ్యమైన కథతో పాటు కమర్షియల్ వ్యాల్యూస్‌‌‌‌ ఉన్న సినిమా చేయాలనుకున్నా.  ఏడాది టైమ్ తీసుకుని ప్రశంకర్‌‌‌‌‌‌‌‌ ఈ స్క్రిప్ట్ రెడీ చేశాడు.   నా మార్కెట్ కంటే ఎక్కువే ఖర్చు చేసి తీశాం. నన్ను నిలబెట్టే సినిమా అవుతుందని నమ్ముతున్నా.  

బ్లడ్ బాత్ చేయించే వరుస యాక్షన్ సినిమాల మధ్య ఈ సినిమా రీఫ్రెషింగ్‌‌‌‌గా ఉంటుంది. ప్రేక్షకులు థియేటర్‌‌‌‌‌‌‌‌లో హాయిగా ఓ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ను ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు.  డైరెక్టర్ ప్రశంకర్ మాట్లాడుతూ ‘తన గర్ల్ ఫ్రెండ్ లోని డిఫరెంట్ ఎమోషన్స్ ను క్రిష్ అనే అబ్బాయి ఎలా ఫేస్ చేశాడు అనేది ఈ మూవీ స్టోరీ.  ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్‌‌‌‌తో పాటు మెసేజ్‌‌‌‌ ఉన్న సినిమా ఇది’ అని చెప్పాడు. హీరోయిన్ మధుమిత సర్కార్, నటి మధురిమ, ఫైట్ మాస్టర్ అంజి,  ఆర్ట్ డైరెక్టర్ భార్గవ నౌండ్ల పాల్గొన్నారు.