హైదరాబాద్, వెలుగు: అరబిందో ఫార్మా సెప్టెంబర్ క్వార్టర్లో ( క్యూ2) అదరగొట్టింది. ఆదాయం వార్షికంగా 24 శాతం పెరిగి రూ.10,263 కోట్ల రికార్డు స్థాయికి చేరింది.
నికర లాభం 32.5 శాతం పెరిగి రూ.1,124 కోట్లకు చేరుకోగా, ఇబిటా సైతం 28.5 శాతం వృద్ధితో రూ.2,156 కోట్లుగా నమోదైంది. విస్తరణలో భాగంగా లానెట్ సంస్థను కొనుగోలు చేసింది. ఈ త్రైమాసికంలో 12 యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతులు సాధించింది.
