- ఏటా 80 వేల టన్నులు కొంటామన్న పెప్సీ
హైదరాబాద్, వెలుగు: మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు పెప్సీ , బేయర్, జీఐజెడ్ సంస్థలు హైదరాబాద్లో బుధవారం హార్వెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లోని 35 వేల మంది రైతులకు మెరుగైన వ్యవసాయ పద్ధతులు, నేల ఆరోగ్యం, నాణ్యమైన విత్తనాలపై శిక్షణ ఇవ్వనున్నారు. రాబోయే 24 నెలల్లో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు విస్తరించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
పెప్సీకో మార్కెట్ లింకేజీని కల్పిస్తుండగా, బేయర్ పంట సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తోంది. రాబోయే ఐదేళ్ల ఏళ్లలో రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా డెమో ఫామ్స్ ద్వారా అవగాహన కల్పిస్తారు. ఏటా దేశవ్యాప్తంగా సుమారు 80 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను సేకరించి 14 ప్లాంట్లలో కుర్‌కురే, పఫ్స్ తయారీకి ఉపయోగిస్తున్నారు. ఎల్ నినో, కరవు వంటి సవాళ్లను అధిగమిస్తూ రైతులకు స్థిరమైన దిగుబడులు అందించడానికి ఈ భాగస్వామ్యం ఎంతగానో తోడ్పడుతుందని పెప్సీ ప్రకటించింది.
