- భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం, వెలుగు: కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడొద్దని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరులో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రంగన్న ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై కార్యకర్తలు అందించిన సూచనలు, సలహాలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల సమస్యలను తెలుసుకుని, చర్చించేందుకే ఈ సమ్మేళనం ఏర్పాటు చేశామన్నారు.
సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, మల్‌రెడ్డి అభిషేక్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
