ఏపీలో మురసు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. బుధవారం ( నవంబర్ 4 ) ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి ఏలూరు జిల్లాలో పెద్దవాగు ఉప్పొంగింది. పెద్దవాగు వరదలో 22 మంది కూలీలు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, రెవెన్యూ శాఖ బృందాల సాయంతో కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం, రెడ్డిగణపవరం, కనకపురం గ్రామాలకు చెందిన 22 మంది కూలీలు పామాయిల్ తోటలలో పనులు ముగించుకుని వస్తుండగా.. జీలుగుమిల్లి రౌతుగూడెం వంతెన దగ్గర వచ్చేసరికి పెద్దవాగు వరద ఉధృతికి వంతెన రోడ్డు కొట్టుకుపోవడంతో కూలీలు వంతెనపై వరద నీటిలో చిక్కుకుపోయారు.
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తక్షణమే సహాయక చర్యలతో కూలీలను రక్షించేందుకు చర్యలను తీసుకున్నారు. ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో తో పాటు స్థానిక పోలీస్, రెవిన్యూ సిబ్బంది సహాయక చర్యలలో పాల్గొన్నారు. అత్యంత ప్రమాద పరిస్థితిలో ఉన్న కూలీలను జెసిబి సహాయంతో రక్షించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కూలీలను బుట్టాయిగూడెం లోని తుఫాన్ పునరావాస కేంద్రానికి తరలించి ఆహరం అందించారు. అనంతరం వైద్య సహాయం అందించారు.
కూలీలు వరదలో చిక్కుకున్నారని తెలిసిన తక్షణమే స్పందించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి తమ ప్రాణాలను రక్షించిన కలెక్టర్, జిల్లా యంత్రాంగానికి తెలిపారు కూలీలు. జిల్లా యంత్రాంగానికి తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.
