లక్ష్మీ దేవి పుట్టిన రోజు రానే వచ్చింది. నవంబర్ 6వ తేదీ మన లక్ష్మిదేవి పుట్టిన రోజు.. అదేనండీ ధన త్రయోదశి.. ధంతేరస్.. నార్త్ వాళ్లు అలా అంటే.. మనకు మాత్రం లక్ష్మీ దేవి పుట్టిన పర్వదినం అన్నమాట. ఈ వేడుక రోజున బంగారం కొనటం డబ్బున్నోళ్లకు ఆనవాయితీగా వస్తుంది. డబ్బులు లేనోళ్లు.. వాళ్లకు ఉన్నంతలో ఎంతో కొంత కొనాలనే ఆశ ఉంటుంది. ఈ క్రమంలోనే మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
2026, నవంబర్ 5వ తేదీన హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర ఇలా ఉంది.
* 24 క్యారెట్లు.. 10 గ్రాముల ధర లక్షా 39 వేల 910 రూపాయలుగా ఉంది.
* 22 క్యారెట్లు.. 10 గ్రాముల బంగారం లక్షా 28 వేల 250 రూపాయలుగా ఉంది.
* 18 క్యారెట్లు.. 10 గ్రాముల బంగారం లక్షా 4 వేల 930 రూపాయలుగా ఉంది.
ఇక హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధరలను పరిశీలిస్తే..
కిలో వెండి 2 లక్షల 10 వేల రూపాయలుగా ఉంది. లక్ష్మి దేవి పుట్టిన రోజు రావటంతో.. బంగారం, వెండి ధరలు కొంచెం పెరిగాయి. నిన్నటి రోజుతో పోల్చితే 5వ తేదీన గ్రాము బంగారం 322 రూపాయలు పెరిగింది. అంటే 10 గ్రాముల బంగారం 3 వేల 200 రూపాయలు పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి 10 వేల రూపాయలు పెరిగింది. వారం రోజులుగా బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పు లేకపోయినా.. 6వ తేదీ లక్ష్మి దేవి పుట్టిన రోజు సందర్భంగా.. ఒక రోజు ముందే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
