మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా..? లైఫ్ స్టైల్ లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు..!

మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా..? లైఫ్ స్టైల్ లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు..!

ఈ మధ్య ఏదీ గుర్తుండటం లేదు.. లేదు... అను కున్న పని అనుకున్నప్పుడే చేయకపో తే మర్చిపోతున్నా" "వస్తువు కోసం గదిలోకి వెళ్లాక, ఎందుకు వెళ్లానో మర్చిపోతున్నా" అంటూ మతిమరుపు గురించి చెప్పేవాళ్లు ఎక్కువైపోతున్నారు. మనదేశంలోనూ మతి మరుపు సమస్యతో బాధపడేవాళ్లు రోజురోజుకూ పెరుగుతున్నారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అలాగని అందరికీ అల్జీమర్ ఉన్నట్లు కాదు. మర్చిపోవడానికి చాలా కారణాలుంటాయి. 

పని ఒత్తిడి, నిద్ర సరిగ్గా లేకపోవటం, అనారోగ్యం, మితిమీరిన ఆలో చనలు, వ్యక్తిగత జీవితం.... వంటివి. అయితే, ఒక్కోసారి బతుకుబండి సరిగా నడుస్తున్నా మతిమరుపు వేధిస్తుంటుంది. అందుకు అనేక కారణాలున్నాయని చెప్తున్నారు మానసిక నిపుణులు. కొందరు చేసే పనిలో సంతోషాన్ని పొందుతుంటారు. కానీ కూర్చొన్న చోట నుంచి లేవకుండా పనిచేస్తుంటారు. దాంతో శరీరం కదలదు.ఒకేచోట ఉండిపోతుంది. అలా పనిచేసే వాళ్ల మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. అలసట వస్తుంది. మనసుకు విశ్రాంతి ఇవ్వకపోవటం వల్లే మతిమరుపు వస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. 

ALSO READ : Women tips: మేకప్ కిట్ నీట్గా.. క్లీన్ గా ఉండాలి.. లేకపోతే ఇబ్బందులు వస్తాయి..!

అందుకే ఆఫీసులో అయినా, ఇంట్లో అయినా పని మధ్యలో మెదడుకు విశ్రాంతి ఇవ్వాలి. కంప్యూటర్, సెల్ఫోన్లకు వీలైనంత దూరంగా ఉండాలి. నడక లాంటి చిన్నచిన వ్యాయామాలు చేయాలి. శ్వాసకు సంబం ధించిన ఎక్సర్ సైజ్లు చేయడం వల్ల కూడా మెదడుకు ఆక్సిజన్ బాగా అందుతుంది. మతి మరుపు వస్తుందని బాధపడే కన్నా రోజువారీ జీవితంలో ఇలాంటి చిన్నచిన్నమార్పులు చేసుకుంటే మతిమరుపును సులభంగా పోగొట్టుకోవచ్చు.