38వ పుట్టినరోజు సందర్భంగా కోహ్లీ అదిరిపోయే కోటేషన్.. సక్సెస్ సీక్రెట్ ఇదే!

38వ పుట్టినరోజు సందర్భంగా కోహ్లీ అదిరిపోయే కోటేషన్.. సక్సెస్ సీక్రెట్ ఇదే!

Virat Kohli's 38th Birthday: ప్రపంచ క్రికెట్‌లోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించి, తన అగ్రెసివ్ బ్యాటింగ్, అసాధారణమైన ఫిట్‌నెస్, పట్టుదల, నిలకడతో కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచిన 'కింగ్' విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈరోజు (గురువారం, నవంబర్ 5, 2026) 38వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. 1988 నవంబర్ 5వ తేదీన ఢిల్లీలో జన్మించిన కోహ్లీ.. కఠిన శ్రమ, క్రమశిక్షణ, తనపై తనకు ఉన్న అచంచలమైన నమ్మకంతో ఇండియన్ క్రికెట్‌ను శిఖరాగ్రాన నిలబెట్టాడు. ఈ ప్రత్యేక సందర్భంగా విరాట్ కోహ్లీ చెప్పిన కొన్ని స్ఫూర్తిదాయకమైన కోట్స్ (Inspiring Quotes) ఇప్పుడు V6 వెలుగు వెబ్ సైట్ లో మీకోసం.. 

విజయం కావాలంటే, కష్టపడాల్సిందే: కోహ్లీ 

* "మీరు ఏ పని చేయాలనుకున్నా.. పూర్తి ప్యాషన్‌తో (ఆసక్తితో) చేయండి, దాని కోసం నిజాయితీగా కష్టపడండి."

* "మీపై మీకు ఉండే నమ్మకం (Self-belief), చేసే కష్టమే మీకు ఎల్లప్పుడూ విజయాన్ని అందిస్తాయి."   

* "నేను అంత తేలిగ్గా ఓటమిని ఒప్పుకునే వ్యక్తిని కాదు, ఎప్పటికీ వెనకడుగు వేయను."   

* "ఈ రోజు చాలా కష్టంగా ఉండవచ్చు, రేపు ఇంకా కఠినంగా ఉండవచ్చు.. కానీ ఎల్లుండి కచ్చితంగా అద్భుతమైన రోజు అనేది నీ కోసం వేచి ఉంటుంది.. అలాంటి దాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు (Never give up)"   

ఒత్తిడిలో క్రికెట్ ఆడటం చాలా ఇష్టం: విరాట్

* "నాకు ప్రెజర్‌లో (ఒత్తిడిలో) క్రికెట్ ఆడటమంటే పిచ్చి ఇష్టం. నిజం చెప్పాలంటే.. మైదానంలో ఎలాంటి ఒత్తిడి లేకపోతే నేను పర్ఫెక్ట్ జోన్‌లో లేనట్లే భావిస్తాను."

* "నా చేతిలో ఉన్న బ్యాట్ కేవలం ఆడుకునే బొమ్మ కాదు.. అదొక పవర్ ఫుల్ ఆయుధం! నా జీవితంలో నాకు కావలసిన ప్రతిదాన్నీ అదే ఇచ్చింది."   

►ALSO READ | పారిస్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో.. జొకోవిచ్‌‌‌‌ బోణీ

ఫిట్‌నెస్, కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం: కోహ్లీ 

* "ఒక ఫిట్ బాడీ (Fit Body) మీకు అపరిమితమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మంచి ఆటిట్యూడ్‌ను మించిన ఆకర్షణ మరొకటి లేదు. కానీ, పొగరుకు (Rude), కాన్ఫిడెన్స్‌కు మధ్య ఉన్న తేడాను మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి" అని విరాట్ కోహ్లీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చాడు.

ఇక ఢిల్లీ వీధుల నుంచి యంగ్ క్రికెటర్‌గా అడుగుపెట్టి ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్‌గా ఎదిగిన విరాట్ కోహ్లీ ప్రయాణం.. ప్రతి ఒక్కరికీ పట్టుదలకు నిలువెత్తు నిదర్శనం అని చెప్పాల్సిందే.. V6 వెలుగు తరపున Happy Birthday King Kohli!🎂👑