బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. కన్న కూతురిని తన దగ్గర పని చేసే ఉద్యోగితో సన్నిహితంగా చూసి కోపంతో రగిలిపోయిన ఇంటి యజమాని తన ఉద్యోగిని చచ్చే దాకా కొట్టాడు. యజమాని దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆనందరాజ్ అనే వ్యాపారస్తుడు.. తన 19 ఏళ్ల కూతురు, తన దగ్గర పనిచేసే కిరణ్ అనే 22 ఏళ్ల యువకుడు సన్నిహితంగా మెలగడాన్ని కళ్లారా చూశాడు.
తీవ్ర ఉద్రేకంతో ఊగిపోయిన ఆనంద రాజ్ కిరణ్‌పై దాడి చేసి చంపేశాడు. పోలీసులు ఆనంద్ రాజ్‌ను అరెస్ట్ చేశారు. కేరళకు చెందిన కిరణ్, ఆనందరాజ్కు చెందిన కంపెనీలో పనిచేసేవాడు. ఈ క్రమంలో అతని కూతురితో కిరణ్‌కు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ఇద్దరూ సన్నిహితంగా దగ్గరయ్యేంత వరకూ వెళ్లింది.
►ALSO READ | E20 పెట్రోల్ మాదిరిగా విమానాల్లోనూ గ్రీన్ ఆయిల్: మోడీ సర్కార్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
కిరణ్‌పై దాడి చేయడానికి ముందు ఆనందరాజ్ తన కూతురిని అక్కడి నుంచి దూరంగా పంపించేశాడు. తర్వాత కిరణ్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో కిరణ్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ హత్య పక్కా ప్లాన్‌తో జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎందుకంటే.. కిరణ్‌పై దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఆనంద్ రాజ్, అతని కూతురు తప్ప ఎవరూ లేరు. కిరణ్‌ను ఒక్కడిని చేసి కొట్టాలని ప్లాన్ చేసిన ఆనందరాజ్ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నాక కిరణ్‌ను ఒంటరిని చేసి కొట్టి చంపేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
