ఇస్రో ఖాతాలో మరో విజయం: NVS-03 సక్సెస్.. ఇక స్వదేశీ 'నావిక్' సేవలు మరింత స్పీడ్! 

ఇస్రో ఖాతాలో మరో విజయం: NVS-03 సక్సెస్.. ఇక స్వదేశీ 'నావిక్' సేవలు మరింత స్పీడ్! 

* నావిక్ సేవల బలోపేతానికి ఇస్రో కీలక ప్రయోగం
* జీఎస్ఎల్వీ-ఎఫ్18 ద్వారా ఎన్వీఎస్-03 ప్రయోగం
* జియోసింక్రోనస్ కక్ష్యలో ఉపగ్రహం
* స్వదేశీ నావిగేషన్ సేవల విస్తరణకు ముందడుగు
* భారత్‌తో పాటు 1,500 కిలోమీటర్ల పరిధిలో సేవలు
* నావిగేషన్, ట్రాకింగ్ వ్యవస్థలకు ప్రయోజనం

తిరుపతి, శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టిన ఎన్వీఎస్-03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఎన్వీఎస్-03 ప్రయోగం సక్సెస్: 

భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్ సేవల విస్తరణలో మరో అడుగు ముందుకు పడింది. గత నెల 30వ తేదీన చేపట్టిన ఎన్వీఎస్-03 ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా నింగిలోకి పంపిన ఈ ఉపగ్రహం చివరిదైన మూడో దశ కక్ష్య పెంపు విన్యాసాన్ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. నిర్దేశిత జియోసింక్రోనస్ మూడవ కక్ష్యలో సక్సెస్ ఫుల్ గా ప్రవేశపెట్టారు. 

►ALSO READ | E20 పెట్రోల్ మాదిరిగా విమానాల్లోనూ గ్రీన్ ఆయిల్: మోడీ సర్కార్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

నావిక్ అంటే ఎంటో తెలుసా: 

నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్.. ఇది భారతదేశం అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ.. భారత భూభాగంతో పాటు దేశ సరిహద్దుల నుంచి సుమారు 1,500 కిలోమీటర్ల పరిధి వరకు ఖచ్చితమైన స్థానం, సమయానికి సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది.

స్మార్ట్‌ఫోన్లు, వాహనాల్లో నావిక్ వ్యవస్థ:  

స్మార్ట్‌ఫోన్లు, వాహనాలు, నౌకలు, రైళ్లు, ఇతర రవాణా వ్యవస్థల్లో నావిగేషన్, ట్రాకింగ్ సేవలకు నావిక్ వ్యవస్థని ఉపయోగించే అవకాశం ఉంది. ఇప్పటికే నావిక్ సేవల కోసం పలు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో, ఈ తాజా ప్రయోగంతో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగు వేసినట్లైంది.