Virat Kohli Brand: టీమిండియా చేజ్ మాస్టర్, రికార్డుల వీరుడు విరాట్ కోహ్లీ (Virat Kohli) ఈరోజు (నవంబర్ 5న) తన 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. 2008లో ఒక యంగ్ క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చి, 2010లో స్టైలిష్ ప్యాకేజీగా ప్రకటనల ప్రపంచంలోకి అడుగు పెట్టిన కోహ్లీ.. నేడు ఫిట్నెస్, లైఫ్‌స్టైల్, ఫ్యాషన్, బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఒక ఐకాన్‌గా మారాడు. 38వ బర్త్‌డే వేళ, మైదానం బయట కోహ్లీ బ్రాండ్ సామ్రాజ్యం, రూ. 1,300 కోట్లకు పైగా ఉన్న బ్రాండ్ వ్యాల్యూ, అతని కెరీర్లో నిలిచిపోయిన ఐకానిక్ యాడ్స్ వివరాలు నేటి జనరేషన్ కోసం..
బ్రాండ్ వ్యాల్యూ రూ. 1,320 కోట్లు పైనే:
* ఆగస్టు 2026లో విడుదలైన క్రోల్స్ ఇండియా సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ 2025 (Kroll's India Celebrity Brand Valuation 2025) నివేదిక ప్రకారం.. కోహ్లీ 158.4 మిలియన్ యుఎస్ డాలర్ల (సుమారు రూ. 1,320 కోట్లు) బ్రాండ్ వ్యాల్యూతో భారతదేశంలోనే మూడో స్థానంలో నిలిచాడు. 2024లో 231.1 మిలియన్ డాలర్ల మార్కుతో టాప్‌లో ఉన్న కోహ్లీ బ్రాండ్ విలువలో దాదాపు 31.5 శాతం క్షీణించినప్పటికీ, క్రీడా రంగం నుంచి అతడే నంబర్-1 ఎండార్సర్‌గా కొనసాగుతున్నాడు. ఈ ర్యాంకింగ్స్‌లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (USD 177.9 million) మొదటి స్థానంలో నిలవగా, రణ్వీర్ సింగ్ (USD 162.9 million) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
కోహ్లీ కెరీర్లో టాప్-10 ఐకానిక్ యాడ్స్ (2010 - 2026):
* ఫాస్ట్రాక్ (2010): జెనీలియా డిసౌజాతో కలిసి ఫాస్ట్రాక్ (Fastrack) బ్యాగ్స్ ప్రకటనలో తొలిసారిగా యంగ్, ఫ్లర్టీ, ఆటిట్యూడ్ లుక్‌తో కుర్రకారును విరాట్ ఆకట్టుకున్నాడు.
* నెస్లే మంచ్ (2013): బాలకృష్ణన్ వాలి (Balakrishnan Vaali) అనే ఫన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్‌తో కామెడీ టైమింగ్ చూపిస్తూ క్రంచీ స్నాక్స్ యాడ్‌లో కింగ్ అలరించాడు.
* క్లియర్ షాంపూ (2013) - అనుష్కతో తొలి పరిచయం: గ్రాహం బెన్సింగర్ ఇంటర్వ్యూలో కోహ్లీ చెప్పినట్లు.. తొలిసారి అనుష్క శర్మను కలిసి, షేర్ చేసుకున్న స్క్రీన్ ఇదే! ఈ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారి డిసెంబర్ 2017లో వీరిద్దరినీ వివాహ బంధంలోకి తీసుకెళ్లింది.
* మాన్యావర్ - మోహే (2016-2017): 'నయే రిష్త్ నయే వాదే' గ్లామరస్ కాన్సెప్ట్‌లో అనుష్క-విరాట్లు ట్రెడిషనల్ వెడ్డింగ్ లుక్‌లో మెరిసి సరికొత్త పెళ్లి ప్రమాణాలు చేసుకుంటూ అభిమానులను ఫిదా చేశారు.
* ప్యూమా - one8 (2018): '#ComeOutAndPlay' క్యాంపెయిన్ ద్వారా డిజిటల్ స్క్రీన్లు, ఫోన్లను పక్కనపెట్టి అందరినీ మైదానాల్లోకి వచ్చి ఆడుకోవాలని కోహ్లీ సందేశమిచ్చాడు.
* టూ యమ్ (Too Yumm! - 2018): పక్కా ఫిట్నెస్ ఫ్రీక్ అయిన కోహ్లీ ఐపీఎల్ టైమ్‌లో '#WhyChipsVirat' అని చిప్స్ తింటూ షాకిచ్చాడు. చివరకు బేక్డ్ హెల్దీ స్నాక్స్ ప్రాముఖ్యతను వివరించగా, ఈ బ్రాండ్ సేల్స్ ఏకంగా 98 శాతం పెరగడం విశేషం!
* మింత్రా (2019): 'గో మింత్రా-లా-లా' ప్రచారంలో తమ మొదటి అధికారిక బ్రాండ్ అంబాసిడర్లుగా విరాట్-అనుష్క జోడీ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది.
* లివ్‌స్పేస్ (2022): 'లవ్ ది వే యూ లివ్' కాన్సెప్ట్‌లో హోమ్ ఇంటీరియర్స్ సమస్యలపై విరుష్క దంపతులు చేసిన కామెడీ టైమింగ్ అభిమానులను విపరీతంగా మెప్పించింది.
* ఏషియన్ పెయింట్స్ (2024): 'హర్ ఘర్ ఖేలేగా, హర్ ఘర్ ఖిలేగా' యాడ్‌లో యంగ్ ప్లేయర్ ఇంటికి వెళ్లే స్థానిక సీనియర్ క్రికెటర్ పాత్రలో విరాట్ మెరిసాడు.
* విజిట్ దుబాయ్ (2025), జాన్ వాకర్ (2026): అనుష్కతో కలిసి దుబాయ్ టూరిజంను ప్రమోట్ చేయడంతో పాటు.. మార్చి 2026లో 'కీప్ వాకింగ్' ప్రచారంలో క్రికెట్, తండ్రిగా బాధ్యతలతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన విభిన్న కోణాలను ప్రదర్శించాడు.
