ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అత్యంత సున్నితమైన రాయలసీమ గడ్డపై.. అందులోనూ చిత్తూరు జిల్లాలో ఊహించని.. వింత ఘటన జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగిన విచిత్ర ఘటన సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతోంది.
చంద్రగిరి : అధికారంలో ఉన్నామని అహంకారమా? మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రెచ్చగొట్టేలా టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య వ్యాఖ్యలు #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu https://t.co/K4v2Q3ntVn
— YSR Congress Party (@YSRCParty) November 5, 2026
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం. ఇక్కడ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని. ప్రతిపక్ష, మాజీ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ సందర్భంగా.. చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి అక్కడికి వచ్చారు.
వైసీసీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డితో స్వయంగా వాదనకు దిగారు ఎమ్మెల్యే భార్య సుధారెడ్డి. టీడీపీ నేతలు, కార్యకర్తలను అనవసరంగా రెచ్చగొట్టొద్దు చెవిరెడ్డి.. ఏమైనా ఉంటే మనం మనం చూసుకుందాం.. పోలింగ్ ప్రశాంతంగా జరగనివ్వు అంటూ చెవిరెడ్డితో నేరుగా.. డైరెక్ట్ గా మాట్లాడారు.
అంతటితో ఆగని ఎమ్మెల్యే భార్య సుధారెడ్డి.. పోలింగ్ జరుగుతున్న అన్ని ప్రాంతాలకు కలిసే వెళ్దాం.. ఒకే కారులో వెళదాం.. అప్పుడు రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు శాంతిస్తారు.. ప్రశాంతంగా ఉంటారు అంటూ అందరి ముందు చెవిరెడ్డికి క్లాస్ పీకే ప్రయత్నం చేసింది సుధారెడ్డి. ఎమ్మెల్యే భార్య ఇలా నేరుగా వచ్చి.. నడి రోడ్డుపై ఇలా మాట్లాడటం చూసి చెవిరెడ్డి షాక్ అయ్యారు. అసలే కూటమి పార్టీలు అన్నీ కలిసి ఉన్నాయి.. ఏదో బుక్ అని పెట్టి రాసిరంపాన పెడుతున్నారు.. పోలీసులు ప్రభుత్వానికే అనుకూలంగా ఉన్నారు.. ఎమ్మెల్యే భార్యతో మనకెందుకులే అని.. అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు చెవిరెడ్డి భాస్కరరెడ్డి.
చంద్రగిరిలో ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం! చంద్రగిరి నియోజకవర్గంలో ప్రశాంత పోలింగ్‌కు చెవిరెడ్డి ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపణలు! చెవిరెడ్డి ఎక్కడికి వెళ్తే.. మా వాహనం కూడా అక్కడికే వెళ్తుంది అంటూ స్పష్టం చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధా రెడ్డి. చెవిరెడ్డి కారును ఫాలో అవుతున్న సుధారెడ్డి #Chandragiri #APLocalBodyElections #AndhraPradesh
— Telugu Stride (@TeluguStride) November 5, 2026
చెవిరెడ్డి వెళ్లి పోవటాన్ని గమనించింది ఎమ్మెల్యే భార్య సుధారెడ్డి.. చెవిరెడ్డి ఎటు వెళితే మనం కూడా అటే వెళదాం.. చెవిరెడ్డి ఎక్కడికి వెళితే మనం కూడా అక్కడికి పోదాం.. తీయండి కార్లు.. తీయండి బండ్లు అంటూ తన నేతలు, కార్యకర్తలు, సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. చెవిరెడ్డి అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోతుంటే.. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి సైతం.. చెవిరెడ్డి కారు వెంటే ఆమె కూడా వెళ్లారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఉప్పు నిప్పుగా ఉన్న ఇద్దరు ప్రత్యర్థులు.. పోలింగ్ రోజు ఎదురెదురు పడటమే పెద్ద ఇన్సిడెంట్ అనుకుంటే.. ప్రత్యర్థి నేతను.. ఎమ్మెల్యే భార్య ఇలా ఆటపట్టించటంలో మరో హైలెట్ అంటున్నారు నెటిజన్లు. ఇలాంటి చిత్ర, విచిత్రాలు అన్నీ ఏపీలోనే జరుగుతాయా ఏంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
