Chiranjeevi : మెగాస్టార్ యూఎస్ టూర్.. 'కాకా' ప్రమోషన్స్‌కు తమన్ అదిరిపోయే ప్లాన్!

Chiranjeevi : మెగాస్టార్ యూఎస్ టూర్.. 'కాకా' ప్రమోషన్స్‌కు తమన్ అదిరిపోయే ప్లాన్!

మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కాకా'.  ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ మెగా ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతోంది. లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన ఓ ప్రకటన సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
 
చిరంజీవితో కలిసిన మూవీ సెట్స్ లోదిగిన మోనోక్రోమ్ ఫొటోను తమన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. డిసెంబర్ లో ఓ పాట రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ అమెరికాలో ఉండబోతున్నట్లు తెలిపారు. దీంతో చిరు యూఎస్ పర్యటనపై చర్చనీయాంశమైంది. ఈ మూవీ సాంగ్ అమెరికాలో ప్రత్యేకంగా విడుదల చేయబోతున్నారా? అక్కడి మెగా అభిమానుల కోసం భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారా? అన్న ఆసక్తి నెలకొంది. 

ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌లో చిరంజీవిని కె. సత్యం అనే పాత్రలో పరిచయం చేశారు. ఆక్వా ఇండస్ట్రీలో సూపర్‌వైజర్‌గా కనిపించిన ఆయన పాత్రలో మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంటుందని గ్లింప్స్ సూచించింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ అంశాలు కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు సమాచారం. మరోవైపు తమన్ అందిస్తున్న సంగీతం కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. 

►ALSO READ | OTT Crime Thriller: ఒక్కో ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. జియోహాట్‌స్టార్లో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

ఈ మూవీలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, గెటప్ శ్రీను, అనురాగ్ కశ్యప్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  గతంలో బాబీ, చిరు కాంబినేషన్ లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' సంక్రాంతి బరిలో రిలీజ్ అయి గ్రాండ్ సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అదే సీజన్ లో వీరిద్దరి మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 13, 2027న థియేటర్లలో విడుదల కానుంది.

అయితే మెగాస్టార్ చిరంజీవి అమెరికా పర్యటన తేదీ, సాంగ్ రిలీజ్ వేదిక, ఫ్యాన్స్ తో భేటీ వంటి వివరాలపై ఇంకా మేకర్స్ నుంచి అధికారికి ప్రకటన రావాల్సి ఉంది. డిసెంబర్ లో జరగనున్న ఈ సాంగ్ లాంచ్  కార్యక్రమం ' కాకా ' ప్రమోషన్స్ కు భారీ కిక్ ఇస్తుందా? యూఎస్ లో చిరు చేసే సందడి ఎలా ఉండబోతోంది.. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.