జ్యోతిష్యం : ధనత్రయోదశి రోజు సూర్యుడు నక్షత్రం మార్పు..ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..

జ్యోతిష్యం :  ధనత్రయోదశి రోజు సూర్యుడు నక్షత్రం మార్పు..ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మారుతుంటాయి.  ఇలా మారినప్పుడు   దాని ప్రభావం అన్ని రాశుల వారి జీవితాల పైన కనిపిస్తుంది.  గ్రహాలకు రాజు అయిన సూర్యుడు ..తులా రాశిలోని విశాఖ నక్షత్రంలోకి  2026 రాత్రి 9:03 గంటలకు గంటలకు ప్రవేశించనున్నాడు.   సూర్యుడి నక్షత్రం మార్పు వలన ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు  తెలుసుకుందాం...!

మేషరాశి : గ్రహాలకు రాజు అయిన సూర్యుడు  నక్షత్రం మార్పు వలన  ఈ రాశి వారు  ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు.  ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనవసరంగా కొన్ని వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఏ విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు చెబుతున్నారు. ప్రతి విషయంలో కూడా  కొంచెం గందరగోళంగా ఉండవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఉద్యోగ జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. దీంతో మానసిక ఒత్తిడికి గురవుతారు. ఎవరితోనూ అనవసరంగా వాదించవద్దని పండితులు సూచిస్తున్నారు. భూలావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి.  ఆర్థిక పరంగా ఇబ్బంది లేకపోయినా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులు కొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితులు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

వృషభరాశి:  విశాఖ నక్షత్రంలో సూర్యుడి సంచారం వలన  ఈ రాశి వారికి అన్ని విధాలా కలసి వస్తుంది.వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి.చేపట్టిన ప్రతి పని విజయం చేకూరుతుంది కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు కలుగుతాయి.  ఆర్థిక పరంగా చాలా ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడంతో పాటు అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేతి వృత్తుల వారికి  ఆశించిన దానికంటే ఎక్కువ ఆర్డర్లు వస్తాయి.  వ్యాపారాలు లాభాల బాటపడతాయి.  సంతాన యోగం కలుగుతుంది. నిరుద్యోగులు జాబ్​  ఆఫర్​  లెటర్స్​ అందుకుంటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలిసి వస్తాయి. 

మిథునరాశి:  సూర్యుడు విశాఖ నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి  కోర్టు కేసులు, శత్రు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు బాగా అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. చాలా కాలంగా అప్పుల్లో లేదా పెట్టుబడి పెట్టిన డబ్బులో చిక్కుకున్న వారికి త్వరలో ఉపశమనం లభిస్తుంది. పాత బకాయిలు వసూలవుతాయి. అదృష్టం మీ తలుపు తట్టే అవకాశం ఉంది. ఎన్నడూ చూడని  ఆర్థిక లాభాలు ఉంటాయి.  ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందు తాయి. 

కర్కాటకరాశి:  సూర్యుడు నక్షత్రం మారడం వలన .. విశాఖ నక్షత్రంలో సంచరించే సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి.  ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ విషయాలపై శ్రద్ద చూపించాల్సిన అవసరం ఉంటుంది.  ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు వస్తాయి. ఈ రాశి వారికి మానసిక అశాంతి కలుగుతుంది. ఆర్థికపరమైన లావాదేవీలలో అతిగా నమ్మడం అనర్ధాలకు దారితీస్తుంది. గతాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఎటువంటి భావోద్వేగాలకు లోను కావద్దని పండితులు సూచిస్తున్నారు.

సింహరాశి: విశాఖ నక్షత్రంలో సూర్యుడు సంచారం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా కలసి వస్తుంది.  గత కొంత కాలంగా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.   ఆర్థిక పరంగా అద్భుతమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయమార్గాలు ఏర్పడుతాయి. అనుకోకుండా గతంలో రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగస్తులకు మీ  పనితీరుకు ప్రశంసలు వస్తాయి. పై అధికారుల గుర్తింపుతో పాటు ప్రమోషన్లు కూడా లభించే యోగం ఉందని పండితులు చెబుతున్నారు.  ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుందని పండితులు చెబుతున్నారు. 

కన్యారాశి:  విశాఖ నక్షత్రంలో సూర్యుడి సంచారం వలన ఈ రాశి వారికి  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.   వృత్తి.. ఉద్యోగాల రీత్యా విదేశాల్లో స్థిరపడే అవకాశం ఉంది.  కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభం పొందడం జరుగుతుంది. సమాజంలో  ప్రముఖులతో  సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది..పెళ్లికోసం ఎదురు చూసేవారికి ఉన్నత కుటుంబంలో వారితో సంబందం కుదురుతుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు  చెబుతున్నారు.

తులారాశి: సూర్యుడు విశాఖ నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారు మాట తీరు వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. ధన నష్టం జరగకుండా చూసుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.   ఎవరికి  అప్పులు ఇవ్వవద్దు.. అప్పు తీసుకోవద్దు. ఆర్థిక విషయాలు.. ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వివాదాల విషయంలో.. ఆస్తి విషయాల్లో.. కోర్టు విషయాల్లో నిర్ణయాలను వాయిదా వేయండి.  ఉద్యోగులు కార్యాలయంలో అనవసరంగా అవమానాలు పడతారు. తోటి ఉద్యోగులు వలన సమస్యలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో మాట్లడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండంది. చిన్న విషయం వివాదంగా మారే అవకాశం ఉంది. ఎవరికి హామీ ఉండవద్దు.  వ్యాపారస్తులు ఆచితూచి పెట్టుబడులు పెట్టాలని పండితులు సూచిస్తున్నారు.

వృశ్చికరాశి:  సూర్యుడు విశాఖ నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడంచాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. బుధుడు .. రాశి మార్పు వలన  ఈ రాశి వారికి చిన్నపాటి సమస్యలు రావచ్చు. కష్టానికి తగ్గ ఫలితం కూడా పొందలేరు. . వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  అయినా ఏ మాత్రం నిరుత్సాహం చెందకండి.  ఆలస్యంగా మీరు తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండండి.   అనవసరమైన వాటిని ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయంలో   బదిలీ జరిగే  అవకాశం ఉంది.   ఇది గందరగోళాన్ని పెంచుతుంది. వ్యాపారంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవద్దు.  డబ్బును ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

ధనస్సు రాశి:  సూర్యుడు విశాఖ నక్షత్రంలో సంచారం వలన ఈరాశి వారికి విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలతో ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది.  కీలక ఒప్పందాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.  అవకాశం ఉంటే వాయిదా వేసుకోవడం చాలా మంచిది.ఉద్యోగస్తులకు  కొన్ని ప్రతికూల పరిస్థితుల వలన ఆందోళన కలిగే అవకాశం ఉంది.   గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పులు లాభాలు వస్తాయి. ముఖ్యమైన పనులను సక్రమంగా పూర్తి చేస్తారు. . పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. పూర్వీకుల ఆస్థి కలసి వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  

మకరరాశి: సూర్యుడు విశాఖ నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా కలసి వస్తుంది.  గత కొంత కాలంగా మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.   ఆర్థిక పరంగా అద్భుతమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయమార్గాలు ఏర్పడుతాయి. అనుకోకుండా గతంలో రావలసిన డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగస్తులకు మీ  పనితీరుకు ప్రశంసలు వస్తాయి. పై అధికారుల గుర్తింపుతో పాటు ప్రమోషన్లు కూడా లభించే యోగం ఉందని పండితులు చెబుతున్నారు.  ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుందని పండితులు చెబుతున్నారు. 

కుంభరాశి: సూర్యుడు విశాఖ నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారి ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కెరీర్‌లో పెద్ద టార్గెట్ సాధన లేదా మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది.  వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గి సుఖ సంతోషాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో మంచిపెళ్లి సంబంధం కుదురుతుంది.

మీనరాశి: విశాఖ నక్షత్రంలో సూర్యుడు సంచారం వలన ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు రెట్టింపవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.  ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. .  ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.  మూడు గ్రహాల అనుకూల స్థితి వలన ఈ రాశి వారికి ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న పనులు పరిష్కారమవుతాయి. జాయింట్ వ్యాపారాలు కలసివస్తాయి.  ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.