భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ శత జయంతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని సత్యసాయిబాబా మందిరాల్లో వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్ 23 వ తేదీన భగవాన్ భగవాన్ శ్రీ సత్య సాయి 100 వజయంతి ఉత్సవాలు తిరువూరు శ్రీ సత్య సాయి మందిరంలో జరిగాయి.
ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొని సత్యసాయి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేంకటేశ్వర శాస్త్రి భక్తులచే ప్రత్యేక పూజలు చేశారు. సత్యసాయిబాబా మహిమల గురించి భక్తులకు వివరించారు. భక్తులు శ్రీ భగవాన్ సత్య సాయి బాబా వారిని దర్శించుకున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులుపడకుండా సత్యసాయి సేవా సమితి కన్వీనర్దామెర ప్రభాకరరావు చర్యలు తీసుకున్నారు.
