రిటైర్మెంట్‌కు గుడ్‌బై.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి నికోలస్ పూరన్ రీఎంట్రీ..?

రిటైర్మెంట్‌కు గుడ్‌బై.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి నికోలస్ పూరన్ రీఎంట్రీ..?

Nicholas Pooran: వెస్టిండీస్ విధ్వంసకర వికెట్ కీపర్, బ్యాటర్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?.. 2025 జూన్‌లో కేవలం 29 ఏళ్ల చిన్న వయస్సులోనే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ప్రపంచ క్రికెట్‌ను షాక్‌కు గురి చేసిన పూరన్.. తాజాగా తన రిటైర్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ జాతీయ జట్టులోకి మళ్లీ తిరిగొచ్చేందుకు తలుపులు పూర్తిగా మూసివేయలేదని పూరన్ స్పష్టం చేశాడు.   

సమయం చాలా వేగంగా మారుతుంది: పూరన్

పాయింట్ లిసాస్‌లోని కుమార్ రాంపాట్ క్రికెట్ అకాడమీలో జరిగిన నికీ పి బ్యాటింగ్ అకాడమీ (Nicky P Batting Academy) కార్యక్రమంలో పాల్గొన్న నికోలస్ పూరన్.. తన ఇంటర్నేషనల్ కమ్‌బ్యాక్‌పై మాట్లాడుతూ.. నేను అంతర్జాతీయ క్రికెట్ రీ-ఎంట్రీపై తలుపులను పూర్తిగా ఎప్పుడూ మూసివేయలేదు.. సమయం చాలా వేగంగా మారుతుంది, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను గానీ, ప్రస్తుతం నా దృష్టి అంతా యంగ్ ప్లేయర్లను తీర్చిదిద్దడం పైనే ఉందన్నాడు. అంతేకాకుండా యువ అథ్లెట్లకు ఉద్దేశించి మాట్లాడిన పూరన్.. అవకాశాలు సరిగ్గా లేవని నెపాలు చెప్పకుండా, ఉన్న పరిస్థితుల్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని సూచించాడు. 

►ALSO READ | కింగ్ కోహ్లీ గురించి మీకు తెలియని 38 విషయాలు.. ఓ లుక్కేద్దాం పదండి!

నికోలస్ ఇంటర్నేషనల్ కెరీర్ ట్రాక్ రికార్డ్:

* షాయ్ హోప్ నేతృత్వంలోని వెస్టిండీస్ టీమ్‌లోకి నికోలస్ పూరన్ కమ్‌బ్యాక్ ఇస్తే విండీస్ వైట్ బాల్ జట్టుకు తిరుగుండదని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

* వన్డేలు (ODIs): 61 మ్యాచ్‌ల్లో (58 ఇన్నింగ్స్) 39.66 సగటు, 99.15 స్ట్రైక్ రేట్‌తో పూరన్ 1,983 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.   

* టీ20లు (T20Is): 106 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో 136.39 స్ట్రైక్ రేట్‌తో 2,275 పరుగులు చేశాడు.   

* కెప్టెన్సీ: వెస్టిండీస్ ఫుల్-టైమ్ వైట్ బాల్ కెప్టెన్‌గా వ్యవహరించిన నికోలస్ పూరన్.. 2022 టీ20 ప్రపంచకప్‌లో జట్టును ముందుండి నడిపించాడు. తన కెరీర్‌లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం.