జనవరిలో డబ్ల్యూపీఎల్‌‌.. షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ..

జనవరిలో డబ్ల్యూపీఎల్‌‌.. షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ..

ముంబై: విమెన్స్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ (డబ్ల్యూపీఎల్‌‌) ఐదో సీజన్‌‌ షెడ్యూల్‌‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఈ టోర్నీ జరగనుంది.వడోదరలోని కొత్త బీసీఏ స్టేడియం (కోటాంబి), ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికలుగా ఈ టోర్నీ సాగనుంది. 

రెండు నగరాలు చెరో 11 మ్యాచ్‌‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.  14న జరిగే తొలి మ్యాచ్‌‌లో డిఫెండింగ్ చాంపియన్‌‌ రాయల్ చాలెంజర్స్‌‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. జనవరి 24 వరకు వడోదరలో లీగ్ మ్యాచ్‌‌లు జరగనుండగా, 26 నుంచి బ్రబౌర్న్ స్టేడియంలో మిగతా మ్యాచ్‌‌లు, ప్లేఆఫ్స్, ఫైనల్ జరగనుంది. ఫిబ్రవరి 5న ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహించనున్నారు.