టీం ఇండియా యంగ్ పేసర్లు ట్రాక్ లో పడ్డారు.. న్యూజీలాండ్ కు చుక్కలు చూపించిన అర్షదీప్, గుర్నూర్..!

టీం ఇండియా యంగ్ పేసర్లు ట్రాక్ లో పడ్డారు.. న్యూజీలాండ్ కు చుక్కలు చూపించిన అర్షదీప్, గుర్నూర్..!
  • తొలి వన్డేలో ఇండియా ఘన విజయం
  • 5 వికెట్ల తేడాతో ఓడిన న్యూజిలాండ్‌‌‌‌
  • రాణించిన అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌, గుర్నూర్‌‌‌‌, అన్షుల్‌‌‌‌

ఆక్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌: న్యూజిలాండ్‌‌‌‌తో ఐదు వన్డేల సిరీస్‌‌‌‌లో ఇండియా బోణీ చేసింది. టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో కింగ్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ (51 బాల్స్‌‌‌‌లో 13 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 74) చెలరేగడంతో... బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌‌‌‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో కివీస్‌‌‌‌ను ఓడించింది. ఫలితంగా సిరీస్‌‌‌‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్‌‌‌‌ ఓడిన న్యూజిలాండ్‌‌‌‌ 40.2 ఓవర్లలో 185 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. టిమ్‌‌‌‌ సీఫెర్ట్‌‌‌‌ (38) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. ఇండియా ఇన్నింగ్‌‌‌‌కు వర్షం అంతరాయం కలిగించడంతో.. టార్గెట్‌‌‌‌ను 32 ఓవర్లలో 143 రన్స్‌‌‌‌గా నిర్దేశించారు. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన 

టీమిండియా 22.4 ఓవర్లలో 143/5 స్కోరు చేసి నెగ్గింది. శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ (37) ఫర్వాలేదనిపించాడు. అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ (4/70), గుర్నూర్‌‌‌‌ బ్రార్‌‌‌‌ (3/44) కివీస్‌‌‌‌ను కట్టడి చేశారు. అన్షుల్‌‌‌‌ కాంబోజ్‌‌‌‌ (2/22)కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే శనివారం వెల్లింగ్టన్‌‌‌‌లో జరుగుతుంది.

46 డాట్‌‌‌‌ బాల్స్‌‌‌‌..

ఈ సిరీస్‌‌‌‌కు సీనియర్‌‌‌‌ బౌలర్లు అందుబాటులో లేకపోయినా.. ఇండియా యంగ్‌‌‌‌ పేసర్లు.. కివీస్‌‌‌‌ను అద్భుతంగా కట్టడిచేశారు. మైదానం చిన్నగా ఉన్నా.. అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సరైన లెంగ్త్‌‌‌‌లో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన బౌలింగ్‌‌‌‌ చేశాడు. అన్షుల్‌‌‌‌ కాంబోజ్‌‌‌‌ కూడా మిడిల్‌‌‌‌ ఓవర్లలో కివీస్‌‌‌‌ను నియంత్రించాడు. ముఖ్యంగా తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 46 డాట్‌‌‌‌ బాల్స్‌‌‌‌ వేయడంతో హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ భారీ స్కోరు చేయలేకపోయింది. పవర్‌‌‌‌ప్లేలో అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌.. విల్‌‌‌‌ యంగ్‌‌‌‌ (9), హెన్రీ నికోల్స్‌‌‌‌ (9) ను ఔట్‌‌‌‌ చేయడంతో కివీస్‌‌‌‌ 45/2 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఫీల్డింగ్‌‌‌‌ పరిమితులు సడలించిన తర్వాత గిల్‌‌‌‌.. గుర్నూర్‌‌‌‌ చేతికి బాల్‌‌‌‌ ఇవ్వడం కలిసొచ్చింది. తన బ్యాక్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌తో కివీస్‌‌‌‌ బ్యాటర్లను గుర్నూర్‌‌‌‌ కట్టడి చేశాడు.

తన వరుస ఓవర్లలో టిమ్‌‌‌‌ సీఫెర్ట్‌‌‌‌, టామ్‌‌‌‌ లాథమ్‌‌‌‌ (3)ను ఔట్‌‌‌‌ చేశాడు. అప్పటి వరకు నిలకడగా ఆడిన డారిల్‌‌‌‌ మిచెల్‌‌‌‌ (28) రనౌట్‌‌‌‌ కావడంతో కివీస్‌‌‌‌ 109/5 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో గ్లెన్‌‌‌‌ ఫిలిప్స్‌‌‌‌ (30) ఆదుకునే ప్రయత్నం చేసినా రెండో ఎండ్‌‌‌‌లో సహకారం లభించలేదు. మిచెల్‌‌‌‌ శాంట్నర్‌‌‌‌ (4), నాథన్‌‌‌‌ స్మిత్‌‌‌‌ (1), కైల్‌‌‌‌ జెమీసన్‌‌‌‌ (1) సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌ స్కోరుకే పరిమితం కావడంతో కివీస్‌‌‌‌ 131/8తో నిలిచింది. చివర్లో జాకబ్‌‌‌‌ డఫీ (15 నాటౌట్‌‌‌‌), బ్లెయిర్ టిక్నెర్‌‌‌‌ (34) బ్యాట్లు ఝుళిపించారు. ఫిలిప్స్‌‌‌‌తో కలిసి 54 రన్స్‌‌‌‌ జోడించారు. 

రోహిత్‌‌‌‌ డకౌట్‌‌‌‌.. 

ఛేజింగ్‌‌‌‌లో ఇండియాకు తొలి ఓవర్‌‌‌‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. జెమీసన్‌‌‌‌ (1/34) వేసిన ఫుల్‌‌‌‌ ఔట్‌‌‌‌సైడ్‌‌‌‌ బాల్‌‌‌‌ను వెంటాడి రోహిత్‌‌‌‌ శర్మ (0) మిడాఫ్‌‌‌‌లో శాంట్నర్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇచ్చాడు. 1/1 స్కోరు వద్ద నుంచి గిల్‌‌‌‌, కోహ్లీ అద్భుతంగా ఆడారు. మధ్యలో వర్షం వల్ల ఇన్నింగ్స్‌‌‌‌కు పలుమార్లు అంతరాయం కలిగినా.. ఈ ఇద్దరు ఏకాగ్రత  కోల్పోలేదు. కోహ్లీ తనకు బాగా అలవాటైన కవర్‌‌‌‌ డ్రైవ్స్‌‌‌‌, మిడ్‌‌‌‌ వికెట్‌‌‌‌ షాట్లు, షార్ట్‌‌‌‌ ఆర్మ్‌‌‌‌, ఓవర్‌‌‌‌ ది టాప్‌‌‌‌ ఫుల్‌‌‌‌ షాట్లతో ఫ్యాన్స్‌‌‌‌ను అలరించాడు. 

గురువారం 38వ పుట్టిన రోజు జరుపుకోనున్న కింగ్‌‌‌‌ కోహ్లీ 35 బాల్స్‌‌‌‌లో కెరీర్‌‌‌‌లో 80వ వన్డే హాఫ్‌‌‌‌ సెంచరీని సాధించాడు. రెండో ఎండ్‌‌‌‌లో గిల్‌‌‌‌ కూడా సింగిల్స్‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేశాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌‌‌‌కు 113 రన్స్‌‌‌‌ జోడించారు. అయితే 10 బాల్స్‌‌‌‌ తేడాలో ఈ ఇద్దరితో పాటు అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ (0) కూడా ఔట్‌‌‌‌ కావడంతో ఇండియా స్కోరు 124/4గా మారింది. చివర్లో రాహుల్‌‌‌‌ (3 నాటౌట్‌‌‌‌), నమన్‌‌‌‌ ధీర్‌‌‌‌ (5 నాటౌట్‌‌‌‌) ఈజీగా విజయాన్ని అందించారు. డఫీ 3 వికెట్లు తీశాడు. 

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్‌‌‌‌: 40.2 ఓవర్లలో 185 ఆలౌట్‌‌‌‌ (సీఫెర్ట్‌‌‌‌ 38, టిక్నెర్‌‌‌‌ 34, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ 4/70). ఇండియా: 22.4 ఓవర్లలో 143/5 (కోహ్లీ 74, గిల్‌‌‌‌ 37, డఫీ 3/49). 
 

రగ్బీ జెర్సీతో.. 

టీమిండియా క్రికెటర్లు రోహిత్‌‌‌‌ శర్మ, విరాట్‌‌‌‌ కోహ్లీ, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌కు అరుదైన గౌరవం దక్కింది. న్యూజిలాండ్‌‌‌‌ ఆల్‌‌‌‌ బ్లాక్స్‌‌‌‌ రగ్బీ లెజెండ్‌‌‌‌ కెవెన్‌‌‌‌ మీలాము.. మ్యాచ్‌‌‌‌కు ముందు ఈ త్రయాన్ని  ప్రత్యేక జెర్సీలతో సత్కరించాడు.  మీలామ్‌‌‌‌ కివీస్ తరఫున 132 మ్యాచ్‌‌‌‌లు ఆడి అత్యధిక క్యాప్‌‌‌‌లు సాధించిన రగ్బీ దిగ్గజాలలో ఒకరిగా నిలిచాడు. 2011, 2015 ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మావోరీ సంప్రదాయ నృత్యాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.  

‘మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది. మీ వద్ద వేల జెర్సీలు ఉండొచ్చు. మా సంప్రదాయంలో 'మనా' అంటే గౌరవం, శక్తిని పంచుకోవడం. అదే ఉద్దేశంతో ఈ జెర్సీలు ఇస్తున్నాం’ అని మీలాము పేర్కొన్నాడు. 1వన్డేల్లో ఛేజింగ్‌‌‌‌లో అత్యధిక రన్స్‌‌‌‌ చేసిన తొలి బ్యాటర్ కోహ్లీ (8741). సచిన్‌‌‌‌ (8720)ను అధిగమించాడు. 
 

  • వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌‌‌‌కు వచ్చి అత్యధిక రన్స్‌‌‌‌ (13 వేలు) చేసిన తొలి క్రికెటర్‌‌‌‌ కోహ్లీ. రికీ పాం టింగ్‌‌‌‌ (12662) రెండో ప్లేస్‌‌‌‌లో ఉన్నాడు.
  • న్యూజిలాండ్‌‌‌‌ సొంతగడ్డపై ఆడిన వన్డే సిరీస్‌‌‌‌ల్లో తొలి మ్యాచ్‌‌‌‌ ఓడిపోవడం గత 12 సిరీస్‌‌‌‌ల్లో ఇదే తొలిసారి. కివీస్ చివరిసారిగా 2019లో ఇండియా చేతిలోనే ఓడింది.