హైదరాబాద్, వెలుగు: సీనియర్ మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గురువారం గాంధీభవన్‌కు రావాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆదేశించారు. ఇటీవల ఢిల్లీలో ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం, అది ప్రధాన, సోషల్‌మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నేతలను పిలిచి ఢిల్లీ గొడవపై వివరణ తీసుకోనున్నట్టు గాంధీభవన్‌వర్గాలు వెల్లడించాయి.
