పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వండి..ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ వొకేషనల్ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వండి..ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ వొకేషనల్ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
  •     లక్డీకాపూల్​ విద్యాశాఖ 
  •     కమిషనరేట్​ ఎదుట ధర్నా

సైఫాబాద్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ వొకేషనల్ టీచర్లకు పది నెలలుగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని అసోసియేషన్ అధ్యక్షుడు ఎంజామ్ శివకుమార్, ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని లక్డీకాపూల్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్​ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందిమి పని చేస్తున్నామని, నెలల తరబడి వేతనాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

విద్యా సంవత్సరంలో 12 నెలల పాటు పూర్తి స్థాయి వేతనాలు చెల్లించాలని, మహిళా ఉపాధ్యాయులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసోసియేషన్ సభ్యులు రాజు రెడ్డి, శ్రీదేవి, అనిత, మధు, రాజు, కిషోర్, నవీన్, మంజుల పాల్గొన్నారు.