బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.. మరోసారి సింగర్‌గా మెప్పించారు. తను హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ‘మాతృభూమి’ చిత్రం కోసం ఆయన ఓ పాట పాడారు. ‘తేరి సెక్సీ బ్యూటీ’ అంటూ సాగే ఈ పాటను బుధవారం విడుదల చేశారు. హిమేష్ రేష్మియా స్వరాలు సమకూర్చిన ఈ పాటకు సాజిద్ ఖాన్ సంగీతంతో పాటు సాహిత్యం అందించారు. సింగర్ ముస్కాన్‌తో కలిసి సల్మాన్ పాడారు. సీజర్ గోన్సాల్వెస్ ఈ పాటకు డాన్స్ కంపోజ్ చేశారు.
‘‘తెల్లవారుజామున 5:12 గంటలకు బయలుదేరాల్సి ఉంది, ఫ్లైట్ సమయానికి సిద్ధంగా ఉన్నాను.. రెండు పెగ్గుల తర్వాత నా సెక్సీ బ్యూటీతో టేకాఫ్ అవుతున్నా.. ఎక్కడ ల్యాండ్ అవుతానో తెలియదు” అనే సరదా క్యాప్షన్‌తో ఈ పాటను సోషల్ మీడియాలో సల్మాన్ షేర్ చేశారు. హెడ్‌ఫోన్స్ ధరించి చిరునవ్వుతో కనిపిస్తున్న ఆయన పోస్టర్ ఆకట్టుకుంది. ఇలా పాటలు పాడటం సల్మాన్‌కు కొత్తేమి కాదు. గతంలో వాంటెడ్, కిక్, సుల్తాన్, హీరో లాంటి సినిమాల్లో ఆయన పాటలు పాడారు. సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తుండగా ఆయన భార్యగా చిత్రాంగద సింగ్ నటిస్తోంది. అపూర్వ లఖియా దర్శకుడు. నవంబర్ 13న సినిమా విడుదల కానుంది.
