‘జగమే సంగీతం’ అనే వెబ్ సిరీస్‌తో హీరోయిన్‌గా పరిచయమైన సుష్మిత శెట్టి.. ఇప్పుడు ‘దొంగ నా కొడుకు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటించిన ఈ చిత్రానికి శ్రీను కంబాల దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ సుష్మిత శెట్టి మాట్లాడుతూ ‘ఇందులో చాలా క్యూట్ అండ్ బబ్లీ క్యారెక్టర్‌లో కనిపిస్తా. హీరోని ప్రేమిస్తుంది. అతని ప్రేమ కోసం ఏదైనా చేస్తుంది. తనకు తాను చాలా స్మార్ట్ అనుకుంటుంది. కానీ కొంచెం తింగరి క్యారెక్టర్ (నవ్వుతూ). అందుకే అమాయకత్వంతో తనకు తెలియకుండానే క్రైమ్‌లో ఇన్వాల్వ్ అవుతుంది. ఏదైనా స్మార్ట్‌గా చేయాలనుకుంటుంది కానీ అది కాస్తా కామెడీ అవుతుంది.
నా క్యారెక్టర్‌లో ఇన్సోసెన్స్‌తో కూడిన కామెడీ ఉంటుంది. సినిమా అంతా ఫ్రెష్ కామెడీతో నవ్విస్తుంది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నా. త్వరలోనే వాటిని అనౌన్స్ చేస్తారు. ఇక మా గ్రాండ్ పేరెంట్స్ కన్నడ అయినా 40 ఏళ్ల క్రితమే ఇక్కడకు వచ్చారు. నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగా. శ్రీదేవి గారి స్ఫూర్తితో చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకున్నా. ఆ డ్యాన్స్ ఎక్స్‌ప్రెషన్స్ నుంచి నటనపై ఆసక్తి కలిగింది. భవిష్యత్తులో మంచి డ్యాన్స్ సాంగ్స్‌తో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉంది. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ డాన్సులను ఎక్కువ ఇష్డపడతాను. అలాగే ‘మహానటి’ లాంటి డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్న సినిమా చేయాలనుంది. స్వతహాగా నాకు రొమాంటిక్ కామెడీలు చాలా ఇష్టం. అలాగే హారర్, సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను కూడా ఇష్టపడతాను’ అని చెప్పింది.
