ఎన్టీఆర్ బావమరిది, యువహీరో నార్నే నితిన్ భుజానికి గాయమైంది. తను హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్‌లో కుడి భుజానికి గాయమవడంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఉదయం డాక్టర్స్ ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తిచేశారు. ప్రస్తుతం నితిన్ కోలుకుంటున్నారు. తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కొద్దిరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
ఈ విషయంలో ఎలాంటి వదంతులు నమ్మవద్దని చెప్పారు. కుటుంబ సభ్యులకు గోప్యత కల్పించాలని, ఆసుపత్రికి రావొద్దని కోరారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్ సినిమాల్లో నార్నే నితిన్ హీరోగా నటించారు.
