లిథియం, నికెల్‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ కు రూ.2,814 కోట్లు..పెట్టుబడిలో 30% సబ్సిడీ ఇవ్వనున్న కేంద్రం

లిథియం, నికెల్‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ కు రూ.2,814 కోట్లు..పెట్టుబడిలో 30% సబ్సిడీ ఇవ్వనున్న కేంద్రం
  •     పెట్టుబడిలో 30% సబ్సిడీ ఇవ్వనున్న కేంద్రం

న్యూఢిల్లీ: లిథియం, నికెల్‌‌‌‌‌‌‌‌ వంటి కీలక ఖనిజాలను దేశంలోనే శుద్ధి చేసి వినియోగించుకునేలా కేంద్రం కొత్త పథకాన్ని ప్రకటించింది. దీనికి రూ.2,814 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద దేశంలో 4 ఖనిజ శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో రెండు లిథియం, మరో రెండు నికెల్‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లు ఉంటాయి. ఈ కేంద్రాలను ఏర్పాటు చేసే సంస్థలకు 30% వరకు సబ్సిడీ ఇస్తారు. 

ఒక్కో లిథియం ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు గరిష్టంగా రూ.500 కోట్లు, నికెల్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌కు రూ.900 కోట్ల వరకు కేంద్రం సాయం చేయనుంది. కాగా, ప్రస్తుతం బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ వాహనాలు, ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ పరికరాల తయారీలో ఉపయోగించే లిథియం, నికెల్‌‌‌‌‌‌‌‌ వంటి ఖనిజాల శుద్ధి పదార్థాల కోసం ఇండియా విదేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. దేశంలోనే శుద్ధి కేంద్రాలు ఏర్పాటైతే దిగుమతులు తగ్గడంతోపాటు ఈ ఖనిజాల విలువ పెరిగే అవకాశం ఉంది.