మురసు తుఫాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో వర్షాలు కురిసే ఛాన్స్...!

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో వర్షాలు కురిసే ఛాన్స్...!

మురసు తుఫాన్ ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం ( నవంబర్ 5 ) హైదరాబాద్ సహా తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.మురుసు తుఫాను ఛత్తీస్ ఘడ్ లోకి ప్రవేశించి అల్పపీడనంగా బలహీనపడిందని.. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

హైదరాబాద్ వ్యాప్తంగా చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉందని.. నగరవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి,  జయశంకర్ భూపాలపల్లి,  ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జనగాం, రంగారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.

వర్షాలు కురిసే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. హైదరాబాద్ లో సాయంత్రం ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకోవాలని... అందరూ ఒకేసారి రోడ్డుపైకి వచ్చి ఇబ్బంది పడకూడదని సూచించింది వాతావరణ శాఖ.