- వివిధ కారణాలతో రద్దయిన 1,741 ఇండ్లను అర్హులకు కేటాయింపు
- 875 మందితో వెయిటింగ్ లిస్ట్ సిద్ధం
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌లో ఖాళీగా ఉన్న 1,741 ఫ్లాట్లను అధికారులు లబ్ధిదారులకు కేటాయించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న ఇండ్లను గతంలో లబ్ధిదారులకు కేటాయించారు. అయితే క్షేత్రస్థాయి పరిశీలనలో కొందరు అనర్హులుగా తేలడం, మరికొందరు ఆర్థిక పరిస్థితుల కారణంగా తమకు కేటాయించిన ఇండ్లను వద్దనుకోవడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఇలా క్యూర్ పరిధిలోని 14 నియోజకవర్గాల్లో అందుబాటులోకి వచ్చిన 1,741 ఇండ్లను బుధవారం నిర్వహించిన మాప్ అప్ ఈ-లాటరీ ద్వారా అర్హులకు కేటాయించారు.
కుత్బుల్లాపూర్‌లో 80, మల్కాజిగిరిలో 150, కూకట్‌పల్లిలో 59, సనత్‌నగర్‌లో 88, కంటోన్మెంట్లో 66, బహదూర్‌పురలో 91, కార్వాన్లో 73, మేడ్చల్‌లో 143, నాంపల్లిలో 106, మలక్‌పేటలో 171, మహేశ్వరంలో 201, రాజేంద్రనగర్‌లో 133, ఖైరతాబాద్‌లో 327, అంబర్‌పేటలో 53 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఖాళీగా ఉన్న ఇండ్లకు అదనంగా మరో 875 మందిని వెయిటింగ్ లిస్ట్ కోసం లాటరీ ద్వారా ఎంపిక చేశారు. వారి అర్హతలు, ఇతర వివరాలను నిర్ధారించేందుకు త్వరలోనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
