కోల్‌కతాలోని మెయిల్ మోటార్ సర్వీసెస్ విభాగంలో వివిధ ఖాళీల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 19 స్కిల్డ్ ఆర్టిజన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా నవంబర్ 30 వరకు అప్లై చేయవచ్చు.
- మొత్తం ఖాళీలు: 19.
- ట్రేడుల వారీగా ఖాళీలు: ఎంవీ మెకానిక్ 8, ఎంవీ ఎలక్ట్రీషియన్ 4, టైర్‌మ్యాన్ 2, బ్లాక్ స్మిత్ 2, పెయింటర్ 1, అప్‌హోల్స్టరర్ 1, కార్పెంటర్ & జాయింటర్ 1.
- విద్యార్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. లేదా 8వ తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఏడాది అనుభవం ఉండాలి. ఎంవీ మెకానిక్ పోస్టులకు వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ (డ్రైవింగ్ లైసెన్స్) కలిగి ఉండాలి.
- వయసు:18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వుడ్ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- అప్లికేషన్: ఆఫ్‌లైన్ ద్వారా.
- ది సీనియర్ మేనేజర్, మెయిల్ మెటార్ సర్వీసెస్, 139, బేలేఘాటా రోడ్, కలకత్తా 700015 చిరునామాకు అప్లికేషన్ పంపించాలి.
- లాస్ట్ డేట్: నవంబర్ 30.
- సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రూట్నీ, షార్ట్ లిస్టింగ్, కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ indiapost.gov.inను సందర్శించండి.
వెలుగు, ఎడ్యుకేషన్
