కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మహారత్న కంపెనీ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్)లో గేట్ స్కోర్ ఆధారంగా ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. నవంబర్ 18 వరకు అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: ఇంజినీర్ ట్రైనీ.
మొత్తం ఖాళీలు: 319.
విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రికల్ 250, సివిల్ 48, కంప్యూటర్ సైన్స్ 21.
విద్యార్హతలు
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు లేదా సీజీపీఏ కలిగి ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది.
- ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ (పవర్)/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్), సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గేట్–2026 క్వాలిఫై అయి ఉండాలి.
- కేవలం గేట్– 2026 స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
- వయసు: 2025, డిసెంబర్ 31 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 3.
- అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు ఫీజు ఉండదు.
- లాస్ట్ డేట్: నవంబర్ 18.
- సెలెక్షన్ ప్రాసెస్: ఎలాంటి రాత పరీక్ష ఉండదు. గేట్– 2026 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- షార్ట్‌లిస్టింగ్ విధానం: అభ్యర్థులను వారి కేటగిరీల వారీగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. గేట్–2026 పరీక్షలో 100 మార్కులకుగాను అభ్యర్థులు సాధించిన నార్మలైజ్డ్ స్కోర్‌ను ప్రధాన ప్రాతిపదికగా తీసుకుంటారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను మాత్రమే గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూకు అనుమతిస్తారు.
- గేట్–2026 స్కోర్: అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో సాధించిన గేట్ మార్కులకు 85 శాతం వెయిటేజీ ఇస్తారు.
- గ్రూప్ డిస్కషన్ (జీడీ): 3 శాతం వెయిటేజీ ఉంటుంది (గ్రూప్ డిస్కషన్‌కు ప్రత్యేకంగా క్వాలిఫైయింగ్ మార్కులు ఉండవు).
- పర్సనల్ ఇంటర్వ్యూ (పీఐ):12 శాతం వెయిటేజీ కేటాయించారు.
- క్వాలిఫైయింగ్ మార్కుల శాతం: అన్‌రిజర్వ్డ్/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు (సంబంధిత రిజర్వుడ్ పోస్టులకు) కనీసం 30 శాతం మార్కులు సాధించాలి.
- మరిన్ని వివరాలకు వెబ్సైట్ powergrid.inను సందర్శించండి.
వెలుగు, ఎడ్యుకేషన్
