ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువులో చిక్కుకున్న 11 మందిలో 10 మంది సేఫ్ !

ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువులో చిక్కుకున్న 11 మందిలో 10 మంది సేఫ్ !

ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువులో చిక్కుకున్న  మత్స్యకారులను రెస్క్యూ టీం రక్షించి సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నీళ్ళలో ఎక్కువ సేపు ఉండటంతో చలితో ఉన్నారని వైద్యులు తెలిపారు.

బేతుపల్లి చెరువులో గల్లంతైన SDRF బృందాలు లోకల్ భాయ్ ధర్మరాజుతో కలిసి 9 మంది ఆచూకీ కనుగొన్నారు. తొమ్మిది మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో ఇద్దరి కోసం NDRF బృందాలు గాలించగా.. మురళీ అనే వ్యక్తి రాత్రి అంతా చెట్టు కొమ్మను పట్టుకొని ఉన్నట్లు గుర్తించారు. మొత్తం మీద పది మంది సురక్షితంగా ఒడ్డుకు చేరారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మురసు తుఫాను బీభత్సం సృష్టించింది. ఏపీని ఆనుకొని ఉన్న అశ్వారావుపేట నియోజకవర్గంలో 48 గంటల్లో 47 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మంగళవారం 20 సెంటీమీటర్లు, బుధవారం రాత్రి వరకు 27 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సత్తుపల్లి నియోజకవర్గంలో 20 సెంమీటర్ల వర్షం పడింది. దీంతో ములకలపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు, తల్లాడ మండలాల్లో పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు అలుగుపోస్తున్నాయి. చాలా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

వరద ప్రభావంతో అశ్వారావుపేటలో ఏపీని ఆనుకొని గుమ్మడివల్లి దగ్గర ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు రింగ్ బండ్​ కు గండి పడింది.రెండేండ్ల కింద ఈ ప్రాజెక్టు ఆనకట్టకు గండిపడగా, తాత్కాలిక ప్రాతిపదికన రింగ్ బండ్​ నిర్మించారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉండగా ఆయకట్టు మొత్తం ఏపీలోని వేలేరుపాడు మండలంలో ఉంటుంది. ఇప్పుడు రింగ్ బండ్​ కు గండిపడడంతో వేలేరుపాడు మండలంలో మూడు గ్రామాలను వరదనీరు ముంచెత్తింది.

అశ్వారావుపేటలో ప్రధాన రహదారితో పాటు పలు కాలనీల్లో ఇండ్లలోకి వరద నీరు చేరుకోవడంతో స్థానికులు ఎత్తయిన బిల్డింగులను ఎక్కి తలదాచుకున్నారు. దొంతికుంట చెరువు ప్రభావంతో వరద వచ్చిందని భావించిన మున్సిపల్ కమిషనర్​దిలీప్​రెడ్డి, చెరువుకు గండి కొట్టి వరద నీటిని బయటకు పంపడంతో ముంపు ప్రభావం తగ్గింది.